2.0 ఫైనల్ ఫిగర్స్ ఇవేనబ్బా..

 2.0 ఫైనల్ ఫిగర్స్ ఇవేనబ్బా..

భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.545 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘2.0’. ఇంత బడ్జెట్ పెడితే.. రికవరీ ఎలా అన్న భయాలు కలిగాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన ‘దంగల్’.. రూ.1800 కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి సినిమాల్ని చూసి ధైర్యం వచ్చింది.

‘రోబో’ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్.. శంకర్-రజనీకాంత్ కాంబినేషన్.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ చూసి ‘2.0’ బడ్జెట్ రికవరీ పెద్ద కష్టం కాదనే అంచనా వేశారు. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనే రూ.180 కోట్లు రాబట్టడం ద్వారా ‘2.0’ నిర్మాతలు ధైర్యంగా అడుగు ముందుకేశారు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని రూ.375 కోట్లకు అమ్మి లాభాలు చేసుకున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. బయ్యర్లు కూడా లాభాలు చూస్తారనే అంచనా వేశారు.

ఐతే ‘2.0’ విడుదలకు కొన్ని నెలల ముందున్న పాజిటివిటీ.. రిలీజ్ ముంగిట కనిపించలేదు. పైగా డివైడ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఓ మోస్తరుగానే వచ్చాయి. సినిమాకు లాంగ్ రన్ ఉన్నప్పటికీ.. అది 3డీ థియేటర్లకే పరిమితం అయింది. 2డీ స్క్రీన్లు వెలవెలబోయాయి. ఒక్క హిందీలో మినహాయిస్తే సినిమా ఎక్కడా బ్రేక్  ఈవెన్ సాధించలేదు. ‘2.0’ థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత బాక్సాఫీస్ లెక్కలు తేలాయి.

వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.300 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. గ్రాస్ రూ.600 కోట్లు దాటింది. రూ.75 కోట్లు.. అంటే బయ్యర్ల పెట్టుబడిలో 20 శాతం నష్టాలు తప్పలేదన్నమాట. తెలుగులో రూ.72 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మితే వసూలైంది రూ.52.5 కోట్ల షేర్ మాత్రమే. తమిళంలో పరిస్థితి మరీ ఇబ్బంది కరం. రూ.100 కోట్లకు హక్కులమ్మితే వచ్చిన షేర్ రూ.63.5 కోట్లే. హిందీలో రూ.90 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. అక్కడ కరణ్ జోహార్ కొంత మేర లాభాలు అందుకున్నాడు. అమెరికాలో ఈ చిత్రం రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కానీ పెట్టుబడిలో రూ.5 కోట్ల పైనే నష్టం అని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English