'యాత్ర' మీద ఏడుపా?

'యాత్ర' మీద ఏడుపా?

ఏ సినిమాని అయినా దాని మెరిట్స్‌ మీద జడ్జి చేయకుండా, తమ వ్యక్తిగత ఇష్టాలు అభిరుచులని రుద్దడం మీడియా చేసే పనేనా? 'యాత్ర' చిత్రం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కథ అయినా, ఆ చిత్రం వల్ల వైసిపికి లాభం చేకూరే అవకాశమున్నా ఆ సినిమా ఎమోషనల్‌గా కదిలించిందనేది కాదనలేని సత్యం. ఆ చిత్రం బడ్జెట్‌కి వస్తోన్న వసూళ్లు చాలా బాగున్నాయనేది కూడా నిజం.

కానీ ఈ చిత్రానికి ఎక్కడో ఒక చోట రావాల్సినంత రాలేదని, దానిని డిజాస్టర్‌ అంటూ రెండవ రోజు ప్రచారం చేయడం ఎక్కడి న్యాయం? ఒక పార్టీకి కొమ్ము కాసే వెబ్‌సైట్లు ఇంకా తొలి షో అయినా స్క్రీన్‌ అవముందే యాత్రపై విష ప్రచారం మొదలు పెట్టినా అది టాక్‌ని ప్రభావితం చేయలేదు. సినిమాకి మంచి టాక్‌ లభించడంతో పాటు అన్ని వెబ్‌సైట్లు, పత్రికలు మంచి రివ్యూలిచ్చాయి. సినిమా బాగుందన్న వారంతా వైసిపి వాళ్లని, సినిమా బాలేదని విషాన్ని ఇంకా చిమ్ముతూ కూర్చోవడం ఏమి నీతి? ఇలాంటి వాళ్లకి మీడియాలో వుండే నైతిక హక్కు ఎక్కడిది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English