బాలా మాదిరిగా క్రిష్‌ ఎందుకు చేయలేదు

బాలా మాదిరిగా క్రిష్‌ ఎందుకు చేయలేదు

'అర్జున్‌ రెడ్డి' తమిళ రీమేక్‌ని స్క్రాప్‌ చేస్తున్నట్టు, బాలా తీసిన వెర్షన్‌ నచ్చలేదు కనుక వేరే వారితో మళ్లీ తీస్తున్నట్టు 'వర్మ' నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాత అబద్ధం చెప్పాడని, తనంతట తానుగా ఈ చిత్రం నుంచి వైదొలిగానని బాలా ఒక ప్రెస్‌నోట్‌ విడుదల చేసాడు. క్రియేటివ్‌ స్వేఛ్ఛకి భంగం వాటిల్లకుండా ఈ చిత్రం నుంచి వైదొలిగానని, నిర్మాత అసత్య ప్రచారం చేయడంతో వివరణ ఇస్తున్నానని చెప్పాడు. అర్జున్‌రెడ్డి రీమేక్‌ బాధ్యతలు తనకి అప్పగించినపుడు సినిమా ఎలా తీయాలనే దానిపై పూర్తి హక్కులు తనవేనని ఒప్పందం చేసుకున్నామని, కానీ ఇప్పుడు మార్పు చేర్పులు సూచించడంతో తను తీసింది కాక ఏ మార్పు జరిగినా తన పేరు వేయవద్దని తానే చెప్పానని బాలా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ భవిష్యత్తుని దృష్టిలో వుంచుకుని ఇక దీనిని ముందుకి లాగదల్చుకోలేదని బాలా తేల్చేసాడు. ఇదిలావుంటే 'మణికర్ణిక' విషయంలో క్రిష్‌కి ఇలాంటి పరిస్థితే వచ్చినపుడు తానెందుకు ఇలా పోరాడలేదని, మార్పులు చేస్తే తన పేరు వేయరాదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోయాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. దర్శకుడి సృజనాత్మకతని ఎవరు అవమానించినా ఆ చిత్రం నుంచి బయటకి వచ్చేయడం లేదా లీగల్‌గా పోరాడడం చేయవచ్చు. కానీ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూసి మీడియా ద్వారా క్రిష్‌ పోరాటం చేయడం చాలా మందికి నచ్చలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English