సాయి పల్లవి రచ్చః రచ్చస్య రచ్చోభ్యహ

సాయి పల్లవి రచ్చః రచ్చస్య రచ్చోభ్యహ


'వచ్చిండే' పాట దక్షిణ భారత వీడియోల్లో అత్యధిక సార్లు యూట్యూబ్‌లో వీక్షించిన రికార్డుని అందుకుని ఎంతో కాలం అవలేదు. ఆ పాట ఏడాదికి పైగా యూట్యూబ్‌లో వుంటే వచ్చిన రికార్డుని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయి రెండు నెలలు తిరగకుండానే 'రౌడీ బేబీ' పాట అధిగమించింది. ఈ రెండు పాటల్లోను హీరోయిన్‌ సాయి పల్లవి కావడం విశేషం. ఈ పాటల్లో హీరోలున్నా కానీ క్రెడిట్‌లో లయన్‌ షేర్‌ సాయి పల్లవికి ఇచ్చి తీరాలి. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోను సాయి పల్లవికి ఫాన్స్‌ వున్నారు. రౌడీ బేబీ పాటలో ఆమె డాన్సులకి దేశ వ్యాప్తంగా అందరూ 'ఫిదా' అయిపోయి 'ఫిదా' పాటని రెండు నెలల్లో బీట్‌ చేసేలా చేసారు.

రౌడీ బేబీ పాట వీడియో చూస్తూ సాయి పల్లవిపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టమనిపించే రేంజ్‌లో డాన్స్‌ అదరగొట్టింది. మంచి డాన్సర్‌ అయిన సాయి పల్లవికి మొదటిసారి పక్కా మాస్‌ సాంగ్‌, అందులోను ప్రభుదేవా మాస్టర్‌ కొరియోగ్రఫీలో చేసే ఛాన్స్‌ వచ్చింది. దాంతో ఇక ఆమె రెచ్చిపోయి ధనుష్‌ని కూడా డామినేట్‌ చేసేసింది. రౌడీ బేబీ పాట ఇంతగా క్లిక్‌ అయిందంటే కారణం మాత్రం సాయి పల్లవి. ఈ పాట మున్ముందు ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో కానీ ఇప్పటికీ రోజుకి మిలియన్‌కి పైగా వ్యూస్‌ తెచ్చుకుంటూనే వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English