తెలుగు సినిమాతో మమ్ముట్టి రికార్డు

తెలుగు సినిమాతో మమ్ముట్టి రికార్డు

ఎప్పుడో 26 ఏళ్ల కిందట ‘స్వాతికిరణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించారు మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తెలుగులో ‘యాత్ర’ సినిమా చేశారు. ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. మమ్ముట్టి నటన గురించైతే చెప్పాల్సిన పని లేదు. వైఎస్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరుకు మన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాతో మమ్ముట్టి అమెరికాలో కెరీర్ హైయెస్ట్ ప్రిమియర్ వసూళ్లు అందుకోవడం విశేషం. ‘యాత్ర’ చిత్రానికి గురువారం అక్కడ ప్రిమియర్స్ ఓ మోస్తరు స్థాయిలోనే పడ్డాయి. 71 వేల డాలర్లకు పైగా ఈ చిత్రం ప్రిమియర్ల ద్వారా రాబట్టింది.

ఇప్పటిదాకా మమ్ముట్టి మలయాళ సినిమాలేవీ కూడా ఈ స్థాయిలో ప్రిమియర్ వసూళ్లు తేలేదు. అక్కడ మలయాళ సినిమాలకు మార్కెట్ తక్కువే. తెలుగులో చిన్న సినిమాలు సైతం అమెరికాలో అదరగొడుతుంటాయి. తెలుగు సినిమాల మార్కెట్తో పోల్చి చూస్తే ‘యాత్ర’కు వచ్చిన వసూళ్లు తక్కువే. అయినా కూడా మమ్ముట్టి కెరీర్ హైయెస్ట్ కావడం విశేషమే. ఐతే శుక్రవారం ఈ చిత్రం అక్కడ 30 వేల డాలర్లే వసూలు చేసింది. శనివారం పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘యాత్ర’ తెలుగు వెర్షన్ తొలి రోజు రూ.2.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు ఓకే అన్నట్లే. ఐతే శని, ఆదివారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.13.5 కోట్ల షేర్ రాబట్టాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English