అమ్మడిది ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఎంట్రీనే..

అమ్మడిది ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఎంట్రీనే..

మలయాళ క్లాసిక్ ‘ప్రేమమ్’లో చిన్న పాత్రతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తర్వాత ఆమె మలయాళంలో కంటే తెలుగులో పెద్ద హీరోయిన్ అయింది. ‘అఆ’ సినిమాలో అతిథి పాత్ర తరహా రోల్ చేసి గుర్తింపు సంపాదించిన అనుపమ.. ఆపై ‘ప్రేమమ్’.. ‘శతమానం భవతి’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టింది. మరోవైపు తమిళంలో అనుపమ చేసిన తొలి సినిమా ‘కొడి’ సైతం సూపర్ హిట్టయింది. దీంతో గోల్డెన్ హీరోయిన్ ట్యాగ్ వచ్చింది అనుపమకు. ఇప్పుడు కన్నడలో సైతం అనుపమ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

శాండిల్ వుడ్లో అనుపమ చేసిన తొలి సినిమా ‘నట సార్వభౌమ’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ కూడా బాగుంది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడం పక్కాగా కనిపిస్తోంది. కన్నడ బిగ్ స్టార్స్‌లో ఒకడైన పునీత్ రాజ్ కుమార్ ఇందులో కథానాయకుడిగా నటించాడు. తెలుగులో ‘పోటుగాడు’ సినిమా తీసిన పవన్ వడెయార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కంటెంట్ పరంగా యావరేజ్ అంటున్నప్పటికీ.. కమర్షియల్‌గా సినిమా పెద్ద సక్సెస్ అయ్యేలా ఉంది.

ఈ చిత్రంలో కళ్లద్దాలు, డిఫరెంట్ మేకప్‌తో అనుపమ కొంచెం కొత్తగా కనిపిస్తోంది. ఆమె పాత్రకు కూడా మంచి స్పందనే వస్తోంది. మొత్తానికి మలయాళంతో మొదలుపెట్టి.. తెలుగు, తమిళం, కన్నడల్లో అనుపమ తొలి సినిమా సూపర్ హిట్ కావడమంటే చిన్న విషయం కాదు. ఇంతకంటే అదృష్ణం ఓ కథానాయికకు ఏముంటుంది? ఐతే అన్నింట్లోకి తెలుగులోనే అనుపమ ఎక్కువ సినిమాలు చేసింది. ఎక్కువ గుర్తింపూ సంపాదించింది. ఐతే ఆమెకు ప్రస్తుతం ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు. వరుస ఫ్లాపుల తర్వాత గత ఏడాది ‘హలో గురూ ప్రేమ కోసమే’ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత ఆమెకు ఛాన్సుల్లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English