ఎన్టీఆర్‌ లెక్క తప్పింది అక్కడే

ఎన్టీఆర్‌ లెక్క తప్పింది అక్కడే

'యాత్ర' చిత్రానికి తొలి రోజు వసూళ్లు మూడు కోట్ల కంటే తక్కువే వచ్చాయి. పెద్ద సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కలక్షన్‌. కానీ ఈ సినిమా బడ్జెట్‌కి ఇది చాలా గొప్ప అమౌంట్‌. ఎందుకంటే రావాల్సిన దాంట్లో ఇరవై అయిదు శాతం తొలి రోజే వచ్చేసింది. ఇక శని, ఆదివారాల్లో కనుక ఈ చిత్రం స్ట్రాంగ్‌గా నిలబడితే హిట్‌ అవడం ఖాయమైపోతుంది.

యాత్ర చిత్రం బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు చాలా పొదుపు పాటించారు. బయ్యర్లకి తక్కువకో, ఎక్కువకో అమ్ముకోవడం కాకుండా స్వయంగా రిలీజ్‌ చేసుకుని రిస్క్‌ అంతా తామే తీసుకున్నారు. యాత్ర చిత్రం బడ్జెట్‌ విషయంలో ఎంత జాగ్రత్త పాటించారో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ని సదరు మేకర్స్‌ అంత ఎక్కువ అంచనా వేసారు. బాలకృష్ణ మార్కెట్‌కి మించి ఖర్చు చేయడమే కాకుండా, బయ్యర్లు కొనడానికి వస్తున్నారు కదా అని ఎక్కువ రేట్లకి అమ్మేసారు. దాంతో ఒక్క మొదటి భాగంపైనే యాభై కోట్లకి పైగా లాస్‌ వచ్చింది.

రెండవ భాగాన్ని ఉచితంగా ఇచ్చేయాల్సి వస్తోంది. ఏ సినిమాకి అయినా కమర్షియల్‌ రేంజ్‌ ఎంత, రీచ్‌ ఎంత అనేది ముందే చూసుకోవాలి. దానికి అనుగుణంగా ఖర్చు పెడితేనే పుణ్యం, పురుషార్థం. ఎన్టీఆర్‌ని కనుక ముప్పయ్‌ నుంచి ముప్పయ్‌ అయిదు కోట్ల రేంజిలో బాలయ్య అన్ని సినిమాల్లానే అమ్మినట్టయితే, వసూళ్లు మొన్న వచ్చినట్టు వచ్చినా, మిగతాది రాబట్టుకోవడం కోసం పబ్లిసిటీ పెంచుకుంటే సరిపోయేది. ఎప్పుడయితే రావాల్సిన దానికీ, వస్తున్న దానికీ పొంతనే లేదో అప్పుడే ఇక ఆశలన్నీ ఆవిరైపోయి మొదటి రోజే ఆ సినిమాని మరచిపోవాలనిపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English