‘సైరా’ చప్పుడు లేదేంది చరణూ?

‘సైరా’ చప్పుడు లేదేంది చరణూ?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా.. అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న సినిమా ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. ఏకంగా రూ.200 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు ఈ చిత్రానికి. చిరంజీవి సహా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప, నయనతార, తమన్నా లాంటి భారీ తారాగణం ఉందీ సినిమాలో.

ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణుల సహకారంతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా చిత్రీకరణ సాగుతోంది. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ ఏడాది వేసవికే సినిమా సిద్ధం కావాల్సింది. కానీ భారీ సినిమా కావడంతో ఆలస్యమవుతోంది. ఇంతకుముందు ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ దసరాకు ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రావచ్చన్న సంకేతాలు ఇచ్చాడు.

ఐతే తాజా సమాచారం ప్రకారం సినిమా మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు వస్తున్న వార్తలు మెగా అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. సినిమా రిలీజ్ విషయంలో అప్ డేట్ ఇవ్వాలని వాళ్లు రామ్ చరణ్‌ను కోరుతున్నారు. తమ అభిమాన కథానాయకుల సినిమా విషయంలో చప్పుడు లేకుండా ఉంటే.. అప్ డేట్ కోసం సోషల్ మీడియాలో డిమాండ్లు చేయడం, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం ఈ మధ్య చూస్తున్నాం. ప్రభాస్ ‘సాహో’ విషయంలోనూ ఇలాంటి డిమాండ్లే వినిపించాయి. ఇప్పుడు ‘సైరా’ విషయంలోనూ అదే జరుగుతోంది.

పోయినేడాది చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ‘సైరా’ టీజర్ రిలీజ్ చేశారు. అప్పటికి టీజర్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే ఆశించని సమయంలో కానుక ఇచ్చి.. ఆ తర్వాత అప్ డేటే ఇవ్వకుండా ఉండిపోయారు. సినిమాకు సంబంధించి ఏ విశేషమూ బయట పెట్టలేదు. ఇప్పుడు సినిమా విశేషాలేవైనా పంచుకోవాలని.. రిలీజ్ విషయంలోనూ అప్ డేట్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. అసలే ‘వినయ విదేయ రామ’ డిజాస్టర్ కావడంతో నిరాశలో ఉన్న అభిమానులతో  ‘సైరా’ ముచ్చట ఏదైనా పంచుకుని చరణ్ ఊరటనిస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English