‘మహర్షి’లో మిగతా ఇద్దరు డమ్మీలేనా?

‘మహర్షి’లో మిగతా ఇద్దరు డమ్మీలేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ ఇంకో రెండున్నర నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ఈ నెలలోనే టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని.. వచ్చే నెలంతా పోస్ట్ ప్రొడక్షన్ పని నడుస్తుందని అంటున్నారు. ప్రమోషన్ భారీ స్థాయిలో చేసి భారీ స్థాయిలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.

ఐతే ‘మహర్షి’కి సంబంధించి మొదట్నుంచి తెర ముందు కనిపిస్తున్నది దిల్ రాజు. ఇది ఆయన సినిమా లాగే ప్రొజెక్ట్ అవుతోంది. ‘మహర్షి’ గురించి మాట్లాడుతున్నది ఆయన ఒక్కడు మాత్రమే. సినమాకు సంబంధించి మిగతా టీం అంతా చిత్రీకరణలో బిజీగా ఉందని అనుకుందాం. కానీ మిగతా ఇద్దరు నిర్మాతలు ఏమయ్యారన్నది ప్రశ్న.

‘మహర్షి’లో అగ్ర నిర్మాతలు అశ్వినీదత్, పీవీపీ కూడా నిర్మాణ భాగస్వాములే. కానీ వాళ్లెక్కడా కనిపించడం లేదు. ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ల నిర్మాణ సంస్థలు కూడా చడీచప్పుడు లేకుండా సైలెంటుగా ఉన్నాయి. ఊరికే పోస్టర్ల మీద వారి బేనర్లు కనిపిస్తున్నాయి అంతే తప్ప.. వాళ్ల యాక్టివిటీ ఏమీ లేదు. నిర్మాణ వ్యవహారాలన్నీ కూడా దిల్ రాజే చూస్తున్నట్లు సమాచారం. దత్‌కు ఓ సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన్ని  సినిమాలో భాగస్వామిగా చేసింది మహేషే.

ఇక పీవీపీ విషయానికి వస్తే.. ఈ సినిమా పని తన బేనర్లో మొదలై.. స్క్రిప్ట్ వర్క్ అంతా తన ఆఫీసులోనే జరగడంతో న్యాయపోరాటం చేసి ఈ సినిమాలో భాగస్వామిగా మారారు. ఐతే ఈ ఇద్దరు నిర్మాతలతో కొంత మేరకు పెట్టుబడి పెట్టించి.. వారికి ఆ మేరకు లాభాలు పంచేందుకు దిల్ రాజు ఒప్పందం చేసుకున్నాడట. అంతకుమించి ప్రొడక్షన్లో వీరి భాగస్వామ్యం ఏమీ ఉండదట. పేరుకే ఆ ఇద్దరూ నిర్మాతలు కానీ.. వారికి ఇంకే రకమైన పాత్ర లేదు. దాదాపుగా డమ్మీలన్నట్లే ఉంది వ్యవహారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English