నితిన్‌ని వంచడానికి త్రివిక్రమ్‌ దిగాలా?

నితిన్‌ని వంచడానికి త్రివిక్రమ్‌ దిగాలా?

నితిన్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భీష్మ అనే చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్‌ చేసింది. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల కథ కూడా రెడీ చేసేసాడు. అయినా కానీ ఇంకా షూటింగ్‌ మొదలు కాలేదు. దీనికి కారణం నితిన్‌ పారితోషికం విషయంలో ఏర్పడ్డ పితలాటకమని అంటున్నారు. నితిన్‌కి మార్కెట్‌ బాగున్నపుడు మాట్లాడుకున్న రేట్లు ఇప్పుడు వర్కవుట్‌ కావు. కానీ నితిన్‌ తగ్గించుకోవడానికి సుముఖంగా లేడనేది పుకారు.

నితిన్‌కి త్రివిక్రమ్‌ అంటే భక్తి కనుక అతడిని రంగంలోకి దించి, నితిన్‌ దిగి వచ్చేలా చూడాలని నిర్మాత భావిస్తున్నట్టు చెబుతున్నారు. నితిన్‌ 'అ ఆ' చేసిన టైమ్‌లోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తరఫున ఈ అగ్రిమెంట్‌ జరిగింది. కానీ అ ఆ తర్వాత అతడికి వరుసగా మూడు ఫ్లాప్‌లు వచ్చి ఇప్పుడు మార్కెట్‌ బాగా పడిపోయింది. నిర్మాతగా పలు నష్టాలు చవిచూసిన నితిన్‌ ఆ నష్టాన్ని పారితోషికం రూపంలో కవర్‌ చేయడానికి బయటి నిర్మాతలకి చేస్తున్నాడు. ఈ టైమ్‌లో పారితోషికం తగ్గించేసుకుంటే మిగతా నిర్మాతలు కూడా తక్కువ చెల్లిస్తారనేది అతని భయం కాబోలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English