ఎన్టీఆర్‌తో పోలిస్తే ఈ లెక్క చిన్నదే

ఎన్టీఆర్‌తో పోలిస్తే ఈ లెక్క చిన్నదే

ఎన్టీఆర్‌ జీవితకథ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కథకి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు చిత్రాల మధ్య పోలిక తెస్తున్నారని, ఎన్టీఆర్‌ అభిమానులు ఈ చిత్రాన్ని ద్వేషిస్తున్నారని గ్రహించి చిత్ర దర్శకుడు మహి ఒక లెటర్‌ కూడా రాసాడు. ఇద్దరు దిగ్గజాలని గౌరవించమని, ఒకరిపై అభిమానంతో మరొకర్ని ద్వేషించకండని విజ్ఞప్తి చేసాడు. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన 'యాత్ర' ప్రోమోస్‌ అయితే చాలా ఆకర్షణీయంగా వున్నాయి. మరి బాక్సాఫీస్‌ని గెలిచేంత సత్తా వుందా లేదా అనేది వేచి చూడాలి.

ఎన్టీఆర్‌తో పోలిస్తే ఈ చిత్రం చాలా తక్కువకే అమ్మారు. అలా అని మమ్ముట్టిపై ఇది తక్కువ రిస్కేమీ కాదు. యాత్ర చిత్రానికి పదమూడు కోట్ల బిజినెస్‌ జరిగిందట. మరి అంత మొత్తాన్ని ఈ చిత్రం రికవర్‌ చేస్తుందా అనేది చూడాలి. సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద సందడి లేకపోవడం, ఈ వారాంతంలో పోటీ పడేందుకు వేరే సినిమాలు లేకపోవడం యాత్రకి కలిసి వస్తుంది. బాగుందనే టాక్‌ వస్తే వైఎస్‌ఆర్‌కి వున్న గుడ్‌విల్‌ ఈ చిత్రం సక్సెస్‌కి హెల్ప్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English