చరణ్‌ అపాలజీకి కారణముంది

చరణ్‌ అపాలజీకి కారణముంది

ఇంతకుముందు కూడా ఫ్లాప్‌ సినిమాలు ఇచ్చినా ఎప్పుడూ సారీ చెప్పని రామ్‌ చరణ్‌ ఈసారి 'వినయ విధేయ రామ'కి మాత్రం ఎందుకు సారీ చెప్పాడనేది మీడియా రాజకీయం చేస్తోంది. సారీ లెటర్‌లో బోయపాటి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేకున్నా కానీ అలా ప్రస్తావించకపోవడం ఏదో నేరమన్నట్టు, ఫ్లాప్‌ బోయపాటి మీదకి తోసేసినట్టు సృష్టిస్తోంది. చరణ్‌కి ఇంతకుముందు కూడా బ్రూస్‌లీ, తుఫాన్‌, ఆరెంజ్‌లాంటి ఫ్లాప్‌లున్నాయి. అయితే ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు సారీ చెప్పాడనేదానికి కారణముంది. బ్రూస్‌లీ తర్వాత ఇక అలాంటి సగటు మాస్‌ సినిమాలు చేయరాదని చరణ్‌ నిర్ణయించుకున్నాడు.

ధృవ, రంగస్థలంతో ట్రాక్‌ మీదకి వచ్చిన చరణ్‌ మళ్లీ ఒక సారి అటో రాయేసి చూసాడు. అదేమో బోయపాటి పుణ్యమా అని బొప్పి కట్టింది. ఇంతకుముందే ఇలాంటి సినిమాలు చేయరాదని డిసైడ్‌ అయ్యాక కూడా తెలిసి, తెలిసీ ఈ తప్పు చేసినందుకే చరణ్‌ సారీ చెప్పాడట. ఇక మీదట ఇలాంటి అర్థం లేని మాస్‌ సినిమాలు చేయకూడదని చరణ్‌ గట్టిగా నిర్ణయించుకున్నాడట. మరోసారి ఆ తప్పు రిపీట్‌ చేయకుండా ఫాన్స్‌కి బహిరంగంగా సారీ చెప్పేసాడట. ఇకపై చరణ్‌ నుంచి ఫెయిల్యూర్స్‌ రావచ్చు కానీ ఇలాంటి మీనింగ్‌లెస్‌ మాస్‌ సినిమాలయితే రావనేది ఆ లేఖ ఆంతర్యమట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English