తమిళ అర్జున్‌రెడ్డి రద్దు.. మళ్లీ తీస్తాం!

తమిళ అర్జున్‌రెడ్డి రద్దు.. మళ్లీ తీస్తాం!

అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌తో హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. విఖ్యాత దర్శకుడు బాలా దర్శకత్వంలో రూపొందిన 'వర్మ' జూన్‌లో విడుదల కావాల్సి వుంది. ఫస్ట్‌ కాపీ కూడా సిద్ధమైన సినిమాని చూసుకుని నిర్మాతలు అవాక్కయ్యారు. చాలా చెత్తగా వుందంటూ, ఈ వెర్షన్‌ని విడుదల చేయలేమని బాలాకి చెప్పేసి, దీనిని స్క్రాప్‌ చేసేస్తున్నట్టు పబ్లిక్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేసారు. మళ్లీ కొత్త దర్శకుడు, కొత్త టీమ్‌తో ఈ చిత్రాన్ని తీస్తామని ప్రకటించారు. ధృవ్‌ హీరోగా కొనసాగుతాడని, అర్జున్‌రెడ్డి లాంటి సినిమాని ఇంత చెత్తగా తమిళ ప్రేక్షకులకి అందించేది లేదని సదరు నిర్మాతలు తేల్చేసారు.

ఎవరో కొత్త దర్శకుడు తీసిన సినిమాని స్క్రాప్‌ చేస్తే అది వేరే సంగతి కానీ బాలా లాంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలు తీసిన దర్శకుడి చిత్రాన్ని పక్కన పడేయడం అందరికీ షాకింగ్‌గా వుంది. పైగా అన్ని కోట్లు ఖర్చయిన సినిమాని పక్కన పడేసి మళ్లీ తీయాలనుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతటా వర్మ హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై బాలా కానీ, విక్రమ్‌ కానీ ఇంకా స్పందించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English