కొడుకు భవిష్యత్.. పూరి ఇగో పక్కన పెట్టాడు

కొడుకు భవిష్యత్.. పూరి ఇగో పక్కన పెట్టాడు

టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలకు తిరుగులేని విజయాలందించిన దర్శకుడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్లకు ఆయా సమయాల్లో బిగ్టెస్ట్ హిట్లు ఇచ్చాడతను. పూరితో పని చేశాక వీళ్ల కెరీర్లో మరో స్థాయికి చేరాయి. అలాంటి దర్శకుడు తన కొడుకు పూరి ఆకాశ్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. గత ఏడాది కొడుకును హీరోగా పెట్టి పూరి తీసిన ‘మెహబూబా’ డిజాస్టర్ అయింది. ఆల్రెడీ ‘ఆంధ్రాపోరి’తో కంగుతిన్న ఆకాశ్‌కు ఇది ఇంకో షాక్. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు ఉన్న ప్రణాళికలు వేరు. ‘మెహబూబా’ కచ్చితంగా హిట్టయిపోతుందన్న ధీమాతో కొడుకుతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు పూరి. కానీ రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. దర్శకుడిగా పూర్తిగా ఫామ్ కోల్పోయిన పూరి.. ఆకాశ్ భవిష్యత్తు దృష్ట్యా అతడితో సినిమాలు చేయకపోవడం బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐతే పూరి ఆత్మవిశ్వాసం ఎలాంటిదన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చెత్త సినిమాలు తీసినా.. తాను ఫామ్ కోల్పోయానని పూరి అనుకోడు. గతంలో ఎన్నోసార్లు పడి లేచిన పూరి.. మళ్లీ తాను సత్తా చాటగలనన్న ధీమాతోనే కనిపించాడు. ఐతే పూరి ఇగోకు పోయి కొడుకు కెరీర్‌ను పాడు చేస్తాడేమో అన్న భయాలు నెలకొన్నాయి. ఈ విషయంలో పూరి కొంచెం ప్రశాంతంగా ఆలోచించినట్లున్నాడు. ముందు అనుకున్న ప్రణాళికల్ని పక్కన పెట్టేశాడు. వెంటనే ఆకాశ్‌తో సినిమా మొదలుపెట్టకపోవడమే అందుకు నిదర్శనం. అంతే కాదు.. ఇప్పుడు ఆకాశ్‌ను వేరే వాళ్ల చేతుల్లో పెట్టాలనే పూరి డిసైడయ్యాడట. పూరి శిష్యుడైన అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. పూరి చెప్పిన ఓ లైన్ ఆధారంగా అనిల్ ఈ చిత్రానికి స్క్రిప్టు రాశాడట. పూరి పర్యవేక్షణలోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English