రజనీకాంత్ పారితోషకంలో కోత

రజనీకాంత్ పారితోషకంలో కోత

దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకడు. ఒక దశలో ఆయన ఈ విషయంలో దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నారు. బాలీవుడ్ హీరోలు కూడా ఆయన వెనుకే నిలిచారు. దేశంలో రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి కథానాయకుడు ఆయనే. ‘2.0’ సినిమాకైతే ఆయన ఏకంగా రూ.60 కోట్ల దాకా పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అలాంటి వాడు ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు 40 శాతం దాకా పారితోషకంలో కోత వేయించుకున్నట్లు సమాచారం.

‘2.0’ తర్వాత రజనీ చేసిన ‘పేట్టకు కూడా రజనీ తక్కువ పారితోషకమే తీసుకున్నాడట. సినిమా ఓవరాల్ బడ్జెట్టే తక్కువ కావడం, బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే జరగడంతో దానికి తక్కువ వర్కింగ్ డేస్ కేటాయించి.. రూ.40 కోట్లతో సరిపెట్టాడట రజనీ. ఇప్పుడు మురుగదాస్ సినిమాకు ఇంకా కొంత పారితోషకం తగ్గించుకున్నాడట. ‘2.0’ను నిర్మించిన లైకా ప్రొడక్షన్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘2.0’ వల్ల లైకా వాళ్లు నష్టపోయారు. దీంతో రజనీ రిబేట్ ఇచ్చాడట. గత దశాబ్ద కాలంలో రజనీ సినిమాల్లో హిట్టయింది ఒక్క రోబో మాత్రమే. మిగతా సినిమాలన్నీ నిర్మాతలను, బయ్యర్లను దెబ్బ తీశాయి. దీంతో రజనీ సినిమా అంటే అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రజనీ ఇప్పుడు పారితోషకం తగ్గించుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు రజనీ చేయబోయే చివరి సినిమా ఇదే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English