ఎన్టీఆర్‌ ముందు దారుణంగా తేలిపోయాడుగా

ఎన్టీఆర్‌ ముందు దారుణంగా తేలిపోయాడుగా

ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' కథకి బాక్సాఫీస్‌ పొటెన్షియల్‌ ఎంత అనేది హిందీలో వచ్చిన 'సింబా' చూపించింది. రెండు వందల నలభై కోట్ల నెట్‌ వసూళ్లతో రణ్‌వీర్‌ సింగ్‌ కెరియర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఇప్పుడదే సినిమా తమిళ రీమేక్‌ 'అయోగ్య' వస్తోంది. ఇందులో విశాల్‌ హీరోగా నటించాడు. ఈ చిత్రం టీజర్‌ చూస్తే 'సింబా'లా కాకుండా టెంపర్‌ని మక్కీకి మక్కీ దించారని అర్థమవుతోంది. విశాల్‌ పోలీస్‌ గెటప్‌లో బాగానే వున్నాడు కానీ ఎన్టీఆర్‌ నటనతో పోల్చుకుంటే మాత్రం దారుణంగా తేలిపోయాడనే చెప్పాలి.

టెంపర్‌లో కొన్ని సీన్లలో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపించాడు. ఆ అభినయాన్ని అనుకరించడం లేదా మరిపించడం చాలా కష్టమనే అనాలి. అందులోను విశాల్‌ నటన యావరేజ్‌ కనుక ఎన్టీఆర్‌ని మ్యాచ్‌ చేయడం జరగని పని. టెంపర్‌ చూడని వాళ్లకి విశాల్‌ నటన ఎలా కనిపిస్తుందనేది తెలియదు కానీ టెంపర్‌ చూసిన తెలుగు సినీ ప్రేక్షకులు 'అయోగ్య' టీజర్‌ చూస్తే విశాల్‌ తేలిపోయాడనే అంటారు. ఎన్టీఆర్‌ కెరియర్లోనే టెంపర్‌లోని నటన అత్యుత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English