సాహో.. ఆ విషయంలో తగ్గట్లేదు

సాహో.. ఆ విషయంలో తగ్గట్లేదు

మన సినిమాల్లో నెమ్మదిగా పాటల ప్రాముఖ్యత తగ్గుతోంది. అయిదు మాండెటరీ పాటల నుంచి నాలుగు పాటలకి పడిపోయింది. కొన్ని సందర్భాల్లో అయితే ఆ నాలుగు పాటల్లో రెండు బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అవుతున్నాయి. డాన్సులు అద్భుతంగా చేసే హీరోలకి కూడా రెండు డాన్స్‌ నంబర్లు మినహా దొరకడం లేదు. అయితే ఈ ట్రెండులో కూడా సాహో చిత్రానికి మాత్రం పాటల విషయంలో రాజీ పడడం లేదు. టాకీ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మిగతా మూడు పాటల చిత్రీకరణకి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్‌ లేట్‌ అయిందనో, ఖర్చు పెరిగిందనో కాకుండా ముందుగా పెడదామని అనుకున్న అన్ని పాటలకి చోటు కల్పిస్తున్నారు.

కథలో హీరోయిన్‌ పాత్ర తక్కువే కనుక పాటల్లో అయినా బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ పారితోషికానికి గిట్టుబాటు అయ్యేట్టు చూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌తో చేస్తోన్న పీరియడ్‌ లవ్‌స్టోరీ కోసం గెటప్‌ మార్చేసిన ప్రభాస్‌ 'సాహో'లో బ్యాలెన్స్‌ పాటల చిత్రీకరణ కోసం మళ్లీ లుక్‌ మారుస్తున్నాడు. ప్రభాస్‌ ఎప్పుడయితే రెడీ అంటాడో అప్పుడు బ్యాలెన్స్‌ మూడు పాటలు తీసేసి గుమ్మడికాయ కొట్టేస్తారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English