నానికి కొమ్ములు మొలిచాయా?

నానికి కొమ్ములు మొలిచాయా?

గత కొన్నేళ్లలో యువ కథానాయకుడు నాని ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకు ముందు వరుస పరాజయాలతో కెరీర్ క్లోజ్ అయిపోయే ప్రమాదంలో కనిపించాడతను. కానీ ఈ సినిమా అతడిని కొంచెం నిలదొక్కుకునేలా చేసింది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో అతడి దశ తిరిగింది. వరుసగా హ్యాట్రిక్.. డబుల్ హ్యాట్రిక్‌లు కొట్టి శరవేగంగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘ఎంసీఏ’ సినిమాతో రూ.35 కోట్లకు పైగా షేర్ సాధించిన స్టామినా అతడిది.

ఐతే దాని తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం‘.. ‘దేవదాస్’ సినిమాలు అతడి జోరుకు బ్రేక్ వేశాయి. ఐతేనేం.. ‘జెర్సీ’తో మళ్లీ గట్టిగానే పుంజుకునేలా కనిపిస్తున్నాడు నేచురల్ స్టార్. ఆసక్తికర కథతో నాని చేస్తున్న ఈ వైవిధ్య ప్రయత్నం ఇటు ప్రేక్షకుల్లో.. అటు ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తినే రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్.. ఇతర హక్కులు కలిపితే దాదాపు రూ.50 కోట్ల దాకా బిజినెస్ జరుగుతున్నట్లు చెబుతున్నారు.

రెండు ఫ్లాపుల తర్వాత నాని సినిమాకు  స్థాయిలో బిజినెస్ జరగడం గొప్ప విషయమే. ఐతే ‘జెర్సీ’కి జరిగిన బిజినెస్ చూసి నాని తర్వాతి సినిమాకు మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘జెర్సీ’ తర్వాత విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో నాని సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో నాని వివిధ అవతారాల్లో కనిపిస్తాడట. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘జెర్సీ’ బిజినెస్ జరిగిన స్థాయిలో ఈ చిత్ర బడ్జెట్ ఉందని అంటున్నారు.

నాని మీద ఏకంగా రూ.45-50 కోట్ల మధ్య ఖర్చు చేస్తున్నారట. నాని, విక్రమ్‌ల పారితోషకమే రూ.15 కోట్ల దాకా అవుతుండగా.. కీర్తి సురేష్ సహా ఐదుగురు హీరోయిన్ల కోసం ఓ ఐదు కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. నాని రేంజ్ ఎంత పెరిగినప్పటికీ.. విక్రమ్ కుమార్‌తో అతడి కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఇది రిస్కుతో కూడుకున్న విషయమే. ఐతే ‘జెర్సీ’ బాగా ఆడితే.. మైత్రీకి ఉన్న గుడ్‌విల్‌తో ఆ మేరకు మార్కెట్ చేసుకోవడం కష్టమేమీ కాదని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English