రామ్‌ చరణ్‌ 2.0... ఉపాసనదే క్రెడిట్‌!

రామ్‌ చరణ్‌ 2.0... ఉపాసనదే క్రెడిట్‌!

'వినయ విధేయ రామ' పరాజయాన్ని అభిమానులు జీర్ణించేసుకుని మూవ్‌ ఆన్‌ అయిపోయారు. అయితే సడన్‌గా ఈ పరాజయానికి సారీ చెబుతూ మరోసారి నిరాశ పరచకుండా మిమ్మల్ని రంజింపచేయడానికి కష్టపడతానంటూ చరణ్‌ ఒక లెటర్‌ విడుదల చేసాడు. అభిమానులు ఈ సారీ నోట్‌ చూసి చలించిపోయారు. ఫ్లాప్‌ అని హుందాగా ఒప్పుకోవడమే కాకుండా మళ్లీ ఇలాంటివి రిపీట్‌ కాకుండా చూసుకుంటానని చాలా తక్కువ మంది హీరోలు చేస్తారు. ఒకప్పుడు దుందుడుకు స్వభావం వున్న చరణ్‌ ఇప్పుడు అందరు హీరోలతో స్నేహ సంబంధాలు మెయింటైన్‌ చేస్తూ, వేరే వారి విజయాలని ఆస్వాదిస్తూ చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇంతకుముందు కూడా పరాజయాలు వచ్చాయి కానీ చరణ్‌ ఎప్పుడూ ఇలా అభిమానులకి సారీ చెబుతూ ఉత్తరం రాయలేదు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సోషల్‌ స్కిల్స్‌ విషయంలో చరణ్‌ ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది హీరోల కంటే బెటర్‌ అనిపిస్తున్నాడు. ఇకపై అతడిని ఆదర్శంగా తీసుకుని మిగతా హీరోలు కూడా తమ సినిమాలు ఫ్లాప్‌ అయినపుడు ఫాన్స్‌కి ఇలా సారీ చెప్పవచ్చు. అయితే చరణ్‌ మాత్రం ఈ విషయంలో ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యాడు. చరణ్‌లోని ఈ మార్పులకి అతని భార్య ఉపాసన కారణమని, ముఖ్యంగా రిలేషన్స్‌ మెయింటైన్‌ చేయడంలో, సోషల్‌ స్కిల్స్‌లో ఉపాసన నుంచి చరణ్‌ చాలా నేర్చుకున్నాడని, అతనిలోని మార్పుకి ఇదే కారణమని అతని సన్నిహితులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English