విజయ్‌ దేవరకొండ అంత ఈజీగా పడడు

విజయ్‌ దేవరకొండ అంత ఈజీగా పడడు

విజయ్‌ దేవరకొండతో సినిమా తీస్తే ఇప్పుడు నలభై, యాభై కోట్లు ఎటూ పోవు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ముప్పయ్‌ అయిదు నుంచి నలభై కోట్ల ఆఫర్లు వచ్చినా... మిగిలిన రైట్స్‌ కలుపుకుని యాభై కోట్ల బిజినెస్‌ చులాగ్గా జరిగిపోతుంది. అందుకే విజయ్‌ దేవరకొండని మచ్చిక చేసుకోవడానికి ఒకప్పుడు హిట్లిచ్చి ఇప్పుడు హీరోలు దొరకని కొందరు దర్శకులు, ప్రస్తుతం ఫామ్‌లో లేని సీనియర్లు, కొన్ని బ్లాక్‌బస్టర్లు తీసిన అనుభవం వున్న వాళ్లు కాకా పడుతున్నారు.

అందరితోను మంచిగా, సఖ్యతగా 'భయ్యా' అంటూ వుండే విజయ్‌ దేవరకొండ ఎవరికీ అంత తేలిగ్గా పడడట. వారు ఏది ఆశించి అయితే తన వెంట పడుతున్నారనేది అతనికి బాగా తెలుసు. అందుకే ఎవరైనా సినిమా చేద్దామనగానే, కథ తీసుకొస్తే చేసేద్దామని చెబుతుంటాడట. దీంతో విజయ్‌తో సినిమా వుందని ఆ దర్శకులు వేరే వాళ్లకి చెప్పుకుంటారు. కానీ వాళ్లు తనకి నచ్చే కథ తీసుకొస్తే తప్ప డేట్స్‌ ఇవ్వడు కనుక వాళ్లేమి చెప్పుకున్నా విజయ్‌ పట్టించుకోడు. ఎంతమంది సీనియర్లు తనని కమర్షియల్‌ స్టార్‌ అంటూ మసాలా సినిమాల వైపు నడిపించాలని చూస్తున్నా కానీ సున్నితంగా తిరస్కరిస్తూ తనకి నచ్చిన కథలు తెచ్చిన వారితోనే విజయ్‌ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. గాడ్‌ఫాదర్లు లేని ఇండస్ట్రీలో ఈజీగా సైడ్‌ ట్రాక్‌ పట్టేసే హీరోలున్న ఫీల్డులో విజయ్‌కి వున్న క్లారిటీ గురించి అంతా మెచ్చుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English