వ‌ర్మా.. పాతాళం నీ పైన ఉంద‌య్యా

వ‌ర్మా.. పాతాళం నీ పైన ఉంద‌య్యా

అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో న‌టించిన సినిమాకు ఒక్క రూపాయి కూడా షేర్ రాక‌పోవడం, వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌న్నీ థియేట‌ర్ల రెంట్ల‌కు, ప‌బ్లిసిటీ ఖ‌ర్చుల‌కు కూడా సరిపోక‌పోవ‌డం అన్న‌ది దారుణ‌మైన విష‌యం. ఈ ఘ‌న‌తంతా నాగ్‌తో ఆఫీస‌ర్ సినిమా తీసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌కే చెందుతుంది. అంత‌టి దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత వ‌ర్మ మ‌ళ్లీ పుంజుకుంటాడ‌ని ఎవ‌రూ అనుకోలేదు. వ‌ర్మ ఏదైనా సినిమా తీసినా.. దాన్ని జ‌నాలు ప‌ట్టించుకుంటార‌న్న న‌మ్మ‌కాలు లేవు. కానీ నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోని ఆస‌క్తిక‌ర కోణాల‌తో *ల‌క్ష్మీస్ ఎన్టీఆర్* సినిమా తీయ‌డానికి పూనుకుని జ‌నాల్లో కొంత ఆస‌క్తి రేకెత్తించ‌గ‌లిగాడు.

వివాదాస్ప‌ద అంశాల‌తో ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా మీడియాలో దీని గురించి చ‌ర్చ జ‌రిగేలా చేయ‌గ‌లిగాడు. ఈ చిత్రానికి ఈ మాత్రం ప్ర‌చారం రావ‌డం గొప్ప విష‌య‌మే. ఐతే వ‌ర్మ అతి కార‌ణంగా ఈ మ‌ధ్య వ‌చ్చిన బ‌జ్ కాస్తా ప‌క్క‌కు పోయేలా క‌నిపిస్తోంది. ఒక ద‌ర్శ‌కుడిగా త‌న స్థాయి ఏంటో మ‌రిచి మ‌రీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు వ‌ర్మ‌. ట్విట్ట‌ర్లో వ‌ర్మ చేసే అతి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే ఆ అతి కొన్నిసార్లు న‌వ్వు తెప్పిస్తుంది. కొన్నిసార్లు మాత్రం జుగుప్స క‌లిగిస్తుంది. ఇప్పుడు వ‌ర్మ వేస్తున్న ట్వీట్లు అలాగే ఉన్నాయి.

క‌త్తి ప‌ట్టి నిలుచుకున్న ఒక హీరో ముఖానికి త‌న ముఖం త‌గిలించి.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవాల‌ని చూశారో ఖ‌బ‌డ్దార్ అంటూ ఒక ట్వీట్ వేశాడు వ‌ర్మ‌. ఇది ఫ‌న్నీగా అనిపించింది. ఓకే. కానీ ఆ త‌ర్వాత వ‌ర్మ శ్రుతిమించాడు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు కాదు.. మ‌హానాయ‌కుడు కాదు.. అస‌లు నాయ‌కుడు.. నేను ముదురు నాకొడుకుని.. మిగ‌తా వాళ్లు ర‌క‌ర‌కాల నాయ‌కులు.. వెన్ను పోటు నాయ‌కుల‌తో స‌హా అంటూ ఏదో పిచ్చి ప్రేలాప‌న చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా ముందు వ‌దిలిన పోస్ట‌ర్లో త‌న ముఖం తీసి లోకేష్ బాబు ఫేస్ పెట్టాడు.

అత‌నెవరో త‌న‌కు తెలియ‌ద‌ని.. జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌దులు ఇత‌డిని హీరోగా పెడితే *అర‌వింద స‌మేత‌* మూడు రెట్లు ఎక్కువ వ‌సూళ్లు సాధించేద‌ని అన్నాడు. ఇంకా అత‌నెందుకు రాజ‌కీయాల్లో ఉన్నాడు.. సినిమాల్లోకి వ‌చ్చేయొచ్చు క‌దా అంటూ చాలానే సోది చెప్పాడు. మ‌రీ ట్విట్ట‌ర్లో ప‌ని లేకుండా ప‌డి ఉంటే గాలి గాళ్ల త‌ర‌హాలో వ‌ర్మ ఇలాంటి ఎడిట్లు.. ఈ ట్వీట్లు వేయ‌డమేంటో నెటిజ‌న్ల‌కు అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే చెత్త సినిమాలు, చెత్త కామెంట్లతో పాతాళానికి ప‌డిపోయి ఉన్నాడు వ‌ర్మ‌. ఇప్పుడు ఆయ‌న తీరు చూస్తుంటే.. పాతాళం ఆయ‌న కంటే చాలా ఎత్తులో ఉన్న‌ట్లు అనిపిస్తోంది. ఈ విష‌యంలో ఏమైనా సందేహ‌మా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English