ఇప్పుడు మహేష్‌ తో పటాస్ తీస్తాడా?

ఇప్పుడు మహేష్‌ తో పటాస్ తీస్తాడా?

అప్పట్లో దూకుడు సినిమాకు అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు డైరక్టర్ గా తన నాలుగో సినిమా ఎఫ్‌ 2 తో పెద్ద హిట్టే కొట్టాడు. అందుకే వెంటనే మహేష్‌ బాబు కూడా పిలిపించి ఒక సినిమా ఆఫర్ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు అనిల్ మన సూపర్ స్టార్ తో ఎలాంటి సినిమా తీస్తాడనేదే అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం.

నిజానికి అప్పట్లో దూకుడు సినిమాను గుడ్ బాయ్ లెనిన్ అనే జర్మన్ సినిమా ఆధారంగా తీశారు. అయితే అందులో కామెడీ పార్ట్ అంతా మనోళ్ళు సొంతంగా రాసిందే. ఆ సినిమాకు రాసి వాడకుండా పక్కనపెట్టేసిన సీన్లను చాలావరకు అనిల్ తన డెబ్యూ ప్రాజెక్ట్ 'పటాస్' కోసం వాడేశాడు. ఆ కామెడీతో పటాస్ ఏ రేంజ్ హిట్టయ్యిందో తెలిసిందే. మరి ఇప్పుడు మహేష్‌ తో కూడా అలాగే ఏదన్నా కామెడీ మార్కు పోలీస్ యాక్షన్ సినిమా తీస్తాడా? లేదంటే ఇంకేదైనా తీస్తాడా అనేది చూడాల్సిన విషయం.

మాఫియా అండ్ పోలీస్ నేపథ్యంలో అనిల్ రావిపూడి దగ్గర చాలా కథలు ఉన్నాయని.. వాటిలో ఒకటి మహేష్‌ కోసం దించుతాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అలా చూస్తే దూకుడు సినిమా బ్యాచ్ అయిన అనిల్ రావిపూడి అండ్ అనిల్ సుంకర.. మహేష్‌ తో దూకుడు 2 లేదంటే పటాస్ 2 తీసే ఛాన్సుంది. కాని ఆగడు ఫ్లాప్ అయ్యాక.. మహేష్‌ పోలీస్ పాత్రలంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. చూద్దాం ఎటువంటి సినిమా చేస్తారో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English