సమంత, అంజలి.. హిట్టు కొట్టాలి

సమంత, అంజలి.. హిట్టు కొట్టాలి

ఇతర సినిమా ఇండస్ర్టీలతో పోలిస్తే.. మోడ్రన్ టాలీవుడ్లోనే అసలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు అనేవి చాలా తక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఒకప్పుడు విజయశాంతి వంటి హీరోయిన్లు ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తో ఇగరదీశారు కాని.. నేటి తరం మాత్రం వాటితో విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు అందరూ సమంత అండ్ అంజలి హిట్టు కొట్టాలి అని కోరుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోయిన్లు సోలోగా సినిమాలను చేస్తున్నారు. అందులో అనుష్క చేస్తున్న కొత్త సినిమా నుండి.. తమన్నా క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి వరకు చాలానే ఉన్నాయి. ఇకపోతే సమంత కూడా యు-టర్న్ ఆడకపోయినా నందిని రెడ్డి డైరక్షన్లో 'ఓ బేబి' సినిమా చేస్తోంది. అలాగే తెలుగమ్మాయ్ అంజలి కూడా గీతాంజలి 2 సినిమా కోసం సిద్దపడుతోంది. వీరిలో సమంత అండ్ అంజలికి కాస్త సోలో హిట్టు కొట్టే రేంజ్ ఎక్కువగా ఉంది. అందుకే వీరిద్దరూ ఆ సినిమాలతో సక్సెస్ కొడితే మాత్రం.. వీరి అడుగుజాడల్లో చాలామంది భామలు ట్రావెల్ చేసే ఛాన్సుంటుంది.

నిజానికి అంజలి చేసేది హారర్ సినిమా కాబట్టి హిట్టు కొట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆ జానర్ ప్రేక్షకులు కాస్తంత థ్రిల్ అంశాలను అందిస్తే చాలు.. సినిమాను సూపర్ హిట్ చేసిపాడేస్తారు. ఇక సమంత చేసేది మాత్రం కాస్త డిఫరెంట్ ప్రయత్నం. మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్. ఆ కంటెంట్ మనోళ్ళకు ఎంతవరకు ఎక్కుతుంది అనేది చూడాల్సిన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English