ఒక్క రాంగ్‌ స్టెప్‌తో మారుతి మాయం!

ఒక్క రాంగ్‌ స్టెప్‌తో మారుతి మాయం!

ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తున్నాడని, ఫ్యామిలీస్‌కి నచ్చే వినోదాన్ని ఇవ్వగలడని, అన్నిటికీ మించి పల్స్‌ తెలిసిన వాడని మారుతిని బాగా నమ్మారు. అయితే విజయాలతో స్క్రిప్టుని తేలికగా తీసుకుని 'శైలజారెడ్డి అల్లుడు' లాంటి సినిమాని వదిలాడు. స్టార్‌ కాస్టింగ్‌ వల్ల, ఇతర హంగుల వల్ల వచ్చిన ఓపెనింగ్స్‌ కారణంగా డిజాస్టర్‌ తప్పించుకోగలిగాడు కానీ తన పేరు డ్యామేజ్‌ కాకుండా మాత్రం ఆపలేకపోయాడు. శైలజారెడ్డి అల్లుడుకి ముందు మారుతి ఎవరు కావాలనుకుంటే ఆ యువ హీరో డేట్స్‌ తెచ్చుకునేవాడు. నిజానికి అప్పటికే అతనికి విజయ్‌ దేవరకొండ, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి వాళ్లతో ప్రపోజల్స్‌ వున్నాయి. కానీ శైలజారెడ్డి అల్లుడు మిస్‌ఫైర్‌ అవడంతో యువ హీరోలు మారుతి మీద అంత ఆసక్తి చూపించడం లేదు.

గ్యాప్‌ లేకుండా సినిమాలు తీసే అలవాటున్న మారుతికి ఇప్పుడు గ్యాప్‌ వచ్చేసింది. శైలజారెడ్డి అల్లుడు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా తదుపరి చిత్రం ఖరారు కాలేదు. ప్రస్తుతం భలే భలే మగాడివోయ్‌ లాంటి వంక పెట్టలేని స్క్రిప్టు రాసే పనిలో మారుతి బిజీగా వున్నాడు. కథ రెడీ అయిన తర్వాతే హీరోలని కలిసి ఎవరు ఫ్రీగా వుంటే వారితో సినిమా చేస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English