ఎన్టీఆర్‌ హిట్‌ అయి వుంటే పట్టించుకునేవాడా?

ఎన్టీఆర్‌ హిట్‌ అయి వుంటే పట్టించుకునేవాడా?

మణికర్ణిక చిత్రం విషయంలో క్రిష్‌ లేవనెత్తిన పలు అభ్యంతరాలకి కంగన రనౌత్‌ సమాధానం ఇస్తోంది. తనని ఎవరు ఎటాక్‌ చేసినా సైలెంట్‌గా వుండడం అలవాటు లేని కంగన ఈ వ్యవహారంపై వెంటనే స్పందించడానికి అందుబాటులో లేకపోయింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కంగన తనపై విమర్శలు చేస్తోన్న క్రిష్‌తో పాటు మణికర్ణికలోని ఇతర తారాగణానికి కూడా చురకలు వేస్తోంది. క్రిష్‌ ఆరోపణలని కంగన సోదరి రంగోలి ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. అయితే కంగన స్పందన వేరు కనుక, ఆమెకి వుండే రీచ్‌ వేరు కనుక ఈ టాపిక్‌ ఇంకా హాట్‌గా నలుగుతోంది. మరోసారి ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించానని కంగన నొక్కి వక్కాణించింది. క్రిష్‌ భాగస్వామ్యం కూడా వుంది కనుకే ఆయన పేరు కూడా వేసామని, అసలు ఈ సినిమా చెడిపోయిందని, బాగా రాలేదనే అభిప్రాయంతో అతను వుండేవాడని, అందుకే దీనిని పట్టించుకోలేదని, తీరా సినిమా చూసాక, తనకి నచ్చడంతో ఈ రచ్చ మొదలు పెట్టాడని విమర్శించింది.

ఇదిలావుంటే ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఖచ్చితంగా చారిత్రాత్మక విజయం సాధిస్తుందనే నమ్మకంతో క్రిష్‌ 'మణికర్ణిక'ని లైట్‌ తీసుకున్నాడని, ఆక్కడేమి జరుగుతుందనేది తెలిసినా కానీ తనకేమీ పట్టనట్టు వ్యవహరించాడని, తీరా ఎన్టీఆర్‌ బయోపిక్‌ డిజాస్టర్‌ అవడం, మణికర్ణికపై ప్రశంసలు కురవడంతో తన క్రెడిట్‌ కావాలని గొడవ మొదలు పెట్టాడనే టాక్‌ కూడా ఇంటర్నెట్‌లో స్ప్రెడ్‌ అవుతోంది. విశేషం ఏమిటంటే మణికర్ణికకి మిక్స్‌డ్‌ రివ్యూలే వచ్చాయి. బాక్సాఫీస్‌ పరంగా కూడా యావరేజ్‌ ఫలితమే వచ్చింది. కంగన నటించిన 'తను వెడ్స్‌ మను 2' చిత్రం వసూళ్లని కూడా దాటని పక్షంలో 'మణికర్ణిక'లాంటి భారీ చిత్రం సాధించిన ఘనత ఏముంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English