సెంటిమెంటు ప‌ని చేస్తే వాల్మీకి హిట్ట‌వ్వాలి..

సెంటిమెంటు ప‌ని చేస్తే వాల్మీకి హిట్ట‌వ్వాలి..

హ‌రీష్ శంక‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ అనాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. అత‌డిని స్టార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిగ‌ణించి.. త‌న సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకుంటే అంతే సంగ‌తులు. ఆ సినిమా తుస్సుమ‌నాల్సిందే. ఏ అంచ‌నాలు లేన‌పుడు మంచి సినిమాలు తీస్తాడు హ‌రీష్‌. ఎక్కువ ఆశ‌లు పెట్టుకుంటే తుస్సుమ‌నిపిస్తాడు. మాస్ రాజా ర‌వితేజ మంచి ఫాంలో ఉండ‌గా హ‌రీష్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ *షాక్* చేశాడు. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కఒన్నాయి. కానీ అది డిజాస్ట‌ర్ అయింది. దీంతో హ‌రీష్ మీద ముందున్న న‌మ్మ‌కాలన్నీ పోయాయి. అలాంటి టైంలో మ‌ళ్లీ వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో *మిర‌ప‌కాయ్* వచ్చింది. ఈ సినిమా అంచ‌నాల్లేకుండా వ‌చ్చి విజ‌య‌వంత‌మైంది.

దీని త‌ర్వాత *గ‌బ్బ‌ర్ సింగ్* రూపంలో హ‌రీష్‌కు పెద్ద ఛాన్స్ వ‌చ్చింది. *మిర‌ప‌కాయ్* హిట్ట‌యిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హ‌రీష్ డీల్ చేయ‌గ‌ల‌డా అన్న సందేహాలు నెల‌కొన్నాయి. పైగా ఇది రీమేక్ కావ‌డంతో ద‌ర్శ‌కుడి ముద్ర ఏముంటుంద‌నుకున్నారంతా. కానీ *గ‌బ్బ‌ర్ సింగ్*తో ప‌వ‌న్ అభిమానుల్ని ఉర్రూత‌లూగించాడు. రీమేక్ ఎలా తీయాలో చెప్ప‌డానికి ఒక పాఠంలా నిలిచిందీ సినిమా. దీంతో హ‌రీష్ మీద ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. కానీ హ‌రీష్ త‌ర్వాతి సినిమా ఏమైందో తెలిసిందే. దీని త‌ర్వాత త‌న‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్ లేన‌పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ లాంటి అప్ క‌మింగ్ హీరోతో *సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్* తీసి స‌త్తా చాటాడు.

ఆపై మ‌ళ్లీ హ‌రీస్‌కు ఫేమ్ పెరిగింది. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో *దువ్వాడ జ‌గ‌న్నాథం* లాంటి క్రేజీ మూవీ తీశాడు. కానీ ఈసారి మ‌ళ్లీ నిరాశ ప‌రిచాడు. త‌న‌పై అంచ‌నాలు లేని ప్ర‌తిసారీ అత‌ను స‌త్తా చాటుతున్నాడు. పెద్ద అవ‌కాశం అందుకుంటున్నాడు. కానీ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ప్ర‌తిసారీ నిరాశ ప‌రుస్తున్నాడు. *డీజే* త‌ర్వాత ఇప్పుడు హ‌రీష్ తీస్తున్న *వాల్మీకి*పై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఏడాదిన్న‌ర పాటు ఖాళీగా ఉండి.. చివ‌రికి ఇలాంటి మీడియం రేంజ్ సినిమా తీస్తున్నాడు హ‌రీష్‌.  మ‌రి ఎప్ప‌ట్లాగే క‌సిగా ప‌ని చేసి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఈ సినిమా హిట్ట్వాలి. మ‌రి ఏమ‌వుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English