నాగ్ కింగ్ అయి‌న‌ట్లే.. రాజ‌శేఖ‌ర్ కూడా

నాగ్ కింగ్ అయి‌న‌ట్లే.. రాజ‌శేఖ‌ర్ కూడా

స్టార్ హీరో అన‌గానే పేరు వెనుక ఏదో ఒక బిరుదు ఉండాల్సిందే. నాని లాంటి హీరోకు కూడా పేరు ముందు నేచుర‌ల్ స్టార్ అని త‌గిలించేశారు. వ‌రుణ్ తేజ్ మెగా ప్రిన్స్ అయ్యాడు. సాయ‌ధ‌ర‌మ్ తేజ్ సుప్రీమ్ హీరోగా పిల‌వ‌బ‌డుతున్నాడు. ఈ ఒర‌వ‌డి కొన్ని ద‌శాబ్దాల కింద‌ట మొద‌లైంది. ఇప్ప‌టికీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్న చాలామంది సీనియ‌ర్ హీరోల‌కు పేరు ముందు ఏదో ఒక బిరుదు ఉంది. ఐతే వేరే బిరుదులైతే ఓకే కానీ.. *యువ‌*తో ముడిప‌డ్డ‌వి అయితేనే స‌మ‌స్య‌. హీరోకు వ‌య‌సు మీద ప‌డ్డాక యువ అని పిలిస్తే ఇబ్బందే. అక్కినేని నాగార్జునకు ఒక‌ప్పుడు యువ సామ్రాట్ అనే బిరుదుండేది. నాగార్జున 40ల్లోకి వ‌చ్చాక కూడా ఆ బిరుదు కొన‌సాగింది. ఐతే 50వ ప‌డికి చేరువ అవుతున్నా కూడా యువ సామ్రాట్ అంటే బాగోద‌ని స్వ‌యంగా నాగార్జునే ఆ బిరుదు తీసేయ‌మ‌న్నాడు. *కింగ్* సినిమా టైంలో ఈ మాట చెప్పి.. ఇక‌పై త‌న పేరు ముందు *కింగ్* చేర్చుకోమ‌న్నాడు. అభిమానులు అదే చేస్తున్నారు. మీడియా వాళ్లు వార్త‌లు రాసేట‌పుడు కూడా నాగ్ పేరు ముందు కింగ్ వాడుతున్నారు.

ఇక నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఒక‌ప్పుడు *యువ ర‌త్న‌* అనే బిరుదుండేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఐతే వ‌య‌సు మీద ప‌డ్డాక దాన్ని తీసేసి.. *న‌ట‌సింహం* చేర్చారు. ఇదే కోవలో ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ బిరుదు కూడా మారిపోయింది. ఆయ‌న్ని అప్ప‌ట్లో అభిమానులు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలుచుకునేవాళ్ల‌న్న సంగ‌తి తెలిసిందే. ఐతే కాల క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ వ‌య‌సు పెరిగింది. ఆయ‌న ఫాలోయింగ్, మార్కెట్ కూడా ప‌డిపోయాయి. పూర్తిగా ఫేడ‌వుట్ అవ‌డంతో ఆయ‌న‌కు బిరుదులు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఐతే *గ‌రుడ వేగ‌*తో స‌త్తా చాటుకున్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే *క‌ల్కి*గా రాబోతున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో త‌న‌కున్న బిరుదు గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. త‌నను ఒక‌ప్పుడు అంద‌రూ *యాంగ్రీ యంగ్ మ్యాన్* అంటుంటే.. వ‌య‌సు పెరిగాక ఏమంటారు.. యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అంటారా అని చమ‌త్క‌రించేవాడిన‌ని.. ఇప్పుడు *క‌ల్కి* ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న‌ను *యాంగ్రీ స్టార్* అన్నాడ‌ని.. దీంతో క‌న్ఫ్యూజ‌న్ పోయింద‌ని.. ఇక‌పై అభిమానులు త‌న‌ను *యాంగ్రీ స్టార్* అని పిలుచుకోవచ్చ‌ని అన్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English