మెగా మేనల్లుడికి 'కటింగ్‌' తప్పట్లేదు

 మెగా మేనల్లుడికి 'కటింగ్‌' తప్పట్లేదు

వరుస పరాజయాలతో మార్కెట్‌ కోల్పోయిన సాయి ధరమ్‌ తేజ్‌ మళ్లీ తిరిగి నిలబడడానికి 'చిత్రలహరి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. తేజ్‌ ఐ లవ్యూ విడుదల కాకముందే ఓకే అయిన ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేసుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ మంచి ఫామ్‌లో వుండగా అతడికి అడ్వాన్స్‌ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌ అతడు ఫ్లాప్స్‌లో పడిన తర్వాత కూడా డీల్‌ కాన్సిల్‌ చేసుకోలేదు.

ముందుగా నానితో అనుకున్న 'చిత్రలహరి' అతను రిజెక్ట్‌ చేయడంతో సాయి ధరమ్‌ చేతికి వెళ్లింది. అయితే అప్పటి సాయి ధరమ్‌ తేజ్‌ మార్కెట్‌ ప్రకారం ఇరవై కోట్ల పైనే బడ్జెట్‌ అనుకున్న ఈ చిత్రానికి అతని రీసెంట్‌ ఫ్లాపుల కారణంగా 'కోత' పడిపోయింది. ఈ చిత్రాన్ని పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పదిహేను కోట్ల లోపులోనే పూర్తి చేస్తున్నారట.

థియేట్రికల్‌ రైట్స్‌ కూడా తక్కువకి అమ్మాలని చూస్తున్నారట. మిగిలిన అమౌంట్‌ శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ రూపంలో రికవర్‌ అవుతుంది కనుక ఇటీవల తగ్గిపోయిన సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాల మార్కెట్‌కి తగ్గట్టే అన్నీ ప్లాన్‌ చేసుకుంటున్నారట. ఇంతవరకు తీసిన సినిమాలన్నీ భారీగా తీసిన మైత్రి మూవీ మేకర్స్‌కి సవ్యసాచి, అమర్‌ అక్బర్‌ ఆంటొనితో బాగా గట్టి దెబ్బలు తగలడంతో మిడ్‌ రేంజ్‌ హీరోలతో తీసే సినిమాల ఖర్చు విషయంలో జాగ్రత్త పడుతున్నారన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English