విడుద‌లైన 24వ రోజు 8.71 కోట్లు

విడుద‌లైన 24వ రోజు 8.71 కోట్లు

భాషా భేదం లేకుండా ఇప్పుడు ఏ సినిమా అయినా.. రెండు మూడు వారాల‌కు మించి థియేట‌ర్ల‌లో నిలవ‌డం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. నెల రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో క‌నిపించడం క‌ష్ట‌మ‌వుతోంది. ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి.. ఒక‌ట్రెండు వారాల్లో సాధ్య‌మైనంత వ‌సూళ్లు రాబ‌ట్టుకోవ‌డం మీదే నిర్మాత‌లు దృష్టిసారిస్తున్నారు.

చాలా కొద్ది సినిమాలకు మాత్ర‌మే లాంగ్ ర‌న్ ఉంటోంది. గ‌త నెల‌లో విడుద‌లైన "యూరి" సినిమా ఈ కోవ‌లోనిదే. జ‌న‌వ‌రి 11న పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లైన ఈ చిత్రం.. నెమ్మ‌దిగా జ‌నాల్లోకి వెళ్లింది. మొద‌ట్లో పెద్ద‌గా ఆక్యుపెన్సీ లేదు ఈ చిత్రానికి. కానీ చూసిన వాళ్లంతా సినిమా అద్భుతం అన‌డంతో క‌లెక్ష‌న్లు పెరిగాయి. తొలి వీకెండ్లో కంటే ఆ త‌ర్వాతి వీకెండ్లో.. రెండో వీకెండ్లో కంటే ఆ త‌ర్వాతి వీకెండ్లో వ‌సూళ్లు పెరుగుతూ పోవ‌డం విశేషం. నాలుగో వారంలో సైతం ఈ చిత్రం క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు రాబ‌ట్టింది.

మొన్న‌టి శ‌నివారం  "యూరి"కి రూ. 6.53 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తే.. ఆదివారం ఏకంగా రూ.8.71 కోట్లు వ‌సూలు కావ‌డం విశేషం. ఈ రోజుల్లో విడుద‌లైన 24వ రోజు ఒక సినిమాకు 8 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఈ క్ర‌మంలో ఈ చిత్రం "బాహుబ‌లిః ది కంక్లూజ‌న్" రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం విశేషం. ఆ చిత్రం విడుద‌లైన 23వ రోజు రూ.6.35 కోట్లు.. 24వ రోజు రూ.7.8 కోట్లు వ‌సూలు చేసింది. "యూరి" లాంటి చిన్న సినిమా.. ఆ వ‌సూళ్ల‌ను దాట‌డం అద్బుత‌మే.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1800 కోట్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టిన "బాహుబ‌లి"ని ఏ ర‌కంగా అయినా "యూరి" మించ‌డ‌మంటే మామూలు సంగ‌తి కాదు. దీన్ని బ‌ట్టే ఈ చిత్రం ఎంత‌గా జ‌నాల్లోకి వెళ్లింది.. ఏ స్థాయి విజ‌యం సాధించిందో అర్తం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రం ఫుల్ ర‌న్లో రూ.250 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుంద‌ని అంచ‌నా. 2016లో పాకిస్థాన్ మీద భార‌త సైన్యం చేప‌ట్టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English