రోహిత్ బాబూ.. నీకోసం మా సినిమా రెడీ

రోహిత్ బాబూ.. నీకోసం మా సినిమా రెడీ

బాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ల‌లో రోహిత్ శెట్టి ఒక‌డు. అత‌డి సినిమాలు ఏకంగా తొమ్మిది రూ.100 కోట్ల క్ల‌బ్బులో అడుగుపెట్టాయి. ఈ ఘ‌న‌త బాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే మ‌రే ద‌ర్శ‌కుడూ సాధించ‌లేదు. మాస్ మ‌సాలా సినిమాల‌కు పెట్టింది పేరైన రోహిత్.. క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేసి సినిమాలు తీస్తుంటాడు. అత‌ను సొంతంగా క‌థ‌లు రాసుకోవ‌డం అరుదు.

చాలా వ‌ర‌కు సౌత్ సూప‌ర్ హిట్ సినిమాల క‌థ‌లు తీసుకుని.. వాటికి త‌న‌దైన ట్రీట్మెంట్ ఇచ్చి హిట్లు కొడుతుంటాడు. సింగం సిరీస్‌తో పాటు తాజాగా వ‌చ్చిన *సింబా* కూడా ఆ కోవ‌లోనిదే. వీటితో పాటుగా అత‌ను తీసిన *గోల్ మాల్* సిరీస్ సినిమాలు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌య్యాయి. భారీ వ‌సూళ్లు ద‌క్కించుకున్నాయి. *సింబా* త‌ర్వాత రోహిత్ త‌ర్వాతి సినిమా ఏదో ఇంకా ఖ‌రార‌వ్వ‌లేదు. అత‌ను ఇంకో సౌత్ సినిమా దేనిమీదో క‌న్నేసి ఉంటాడ‌నే అంతా అనుకుంటున్నారు.

ఐతే తెలుగులో సంక్రాంతికి విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన *ఎఫ్‌-2* సినిమా రోహిత్ రీమేక్ చేసుకోవ‌డానికి మంచి ఛాయిస్ అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బాలీవుడ్లో బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచిన గోల్ మాల్.. హౌస్ ఫుల్ సినిమాల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది *ఎఫ్‌-2*. భార్యాబాధితుల నేప‌థ్యంలో సినిమా అంటే యూనివ‌ర్శ‌ల్ అన్న‌ట్లే. ఎక్క‌డైనా వినోదం పండుతుంది. అందులోనూ రోహిత్ లాంటి ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డితే లౌడ్ కామెడీతో హోరెత్తించేస్తాడు.

ఎలాగూ దిల్ రాజు సైతం *ఎఫ్‌-2*ను హిందీలో రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఇప్ప‌టిదాకా టాలీవుడ్‌కే ప‌రిమితం అయిన రాజు.. కొన్నాళ్ల కింద‌ట *భార‌తీయుడు-2* ద్వారా త‌మిళంలోకి అడుగుపెట్టాల‌నుకున్నాడు. కానీ కుద‌ర్లేదు. ఐతే *ఎఫ్‌-2* లాంటి సినిమాను రీమేక్ చేస్తే బాలీవుడ్లో ల్యాండింగ్ సేఫ్‌గా జ‌రిగిపోతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఏదైనా బాలీవుడ్ స్టూడియోతో క‌లిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్. మ‌రి అక్క‌డ‌ ద‌ర్శ‌కుడిగా రోహిత్ శెట్టినే ఓకే అవుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English