రాత్రికి వ‌స్తావా.. కోటి రూపాయ‌లిస్తాం

రాత్రికి వ‌స్తావా.. కోటి రూపాయ‌లిస్తాం

*పోటుగాడు* సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయిన భామ సాక్షి చౌదరి. ఆ త‌ర్వాత *జేమ్స్ బాండ్* స‌హా మ‌రికొన్ని చిన్న సినిమాలు చేసిందీ భామ‌. ఐతే ఆమెకు తెలుగులో ఆశించిన బ్రేక్ రాలేదు. ఒక అర‌డ‌జ‌ను దాకా సినిమాలు చేసి అడ్ర‌స్ లేకుండా పోయిందీ అమ్మాయి. చివ‌ర‌గా ఆమె క‌థానాయిక‌గా న‌టించిన *సువ‌ర్ణ సుంద‌రి* సంగ‌తేమైందో కూడా జ‌నాలకు తెలియ‌దు. ఐతే క‌థానాయిక‌గా రాణించ‌న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం సాక్షి లైమ్ లైట్లోనే ఉంటోంది. తాజాగా ఆమె త‌న‌ను కొంద‌రు వేధిస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఒక రాత్రి మాతో గ‌డుపుతావా.. కోటి రూపాయ‌లు ఇస్తాం అంటూ త‌న‌కు ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని సాక్షి చెప్పింది. ఈ రాత్రికి ఖాళీయేనా.. నీ రేటెంత అంటూ వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కొంచెం కూడా భ‌యం లేకుండా ఓపెన్‌గా ఎలా అడుగుతార‌ని ఆమె ప్ర‌శ్నించింది. సినిమాల్లో న‌టించినంత మాత్రాన అమ్మాయిల్ని చుల‌క‌న‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని.. త‌న‌కు ఇలాంటి ఆఫ‌ర్లు చేసిన వాళ్లు మూర్ఖుల‌ని ఆమె మండి ప‌డింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆఫ‌ర్ల‌తో మ‌రోసారి త‌న ముందుకొస్తే వాళ్ల వ్య‌వ‌హార‌మంతా బ‌య‌ట‌పెడ‌తాన‌ని సాక్షి హెచ్చ‌రించింది.

ఐతే గ్లామ‌ర్ ఫీల్డులో ఉన్న వాళ్ల‌ను జ‌నాలు ఇలాంటి కోణంలో చూడ‌టం కొత్తేమీ కాదు. ఇలా పిచ్చి కామెంట్లు చేసేవాళ్లు.. ఆఫ‌ర్లు ఇచ్చేవాళ్లు ఎక్క‌డైనా ఉంటారు. ఇలాంటి వాటిని ప‌ట్టించుకుంటే ముందుకు సాగ‌డం క‌ష్టం. ఇంత‌కుముందు ఇలాంటి వాటిని హీరోయిన్లు అస్స‌లు ప‌ట్టించుకునేవారు కాదు. వాటి గురించి మాట్లాడేవారూ కాదు. ఐతే మ‌ధ్య మీటూ మూమెంట్ పుణ్య‌మా అని హీరోయిన్లు ఇలాంటి విష‌యాల గురించి ఓపెన్ అవుతున్నారు. సాక్షి కూడా ఈ కోవ‌లోనే త‌న‌కు ఎదురైన అనుభ‌వాల గురించి మాట్లాడిన‌ట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English