సినిమాపై అంచ‌నాల్లేవు.. హ్యాపీ

సినిమాపై అంచ‌నాల్లేవు.. హ్యాపీ

మామూలుగా ఒక సినిమాపై మంచి అంచ‌నాలుండ‌గానే ఫిలిం మేక‌ర్స్ కోరుకంటారు. ఐతే కొన్నిసార్లు అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నా ఇబ్బందే. ప్రేక్ష‌కులు సినిమా గురించి ఎక్కువ‌గా ఊహించుకోకుంటేనే మంచిది. ముఖ్యంగా బ‌యోపిక్‌ల విష‌యంలో అంచ‌నాలు ఎంత త‌క్కువ ఉంటే అంత మంచిద‌నిపిస్తోంది. గ‌‌త ఏడాది అద్భుత విజ‌యం సాధించిన *మ‌హాన‌టి* విష‌యంలో ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. సావిత్రి మీద ఇప్పుడు సినిమా ఏంట‌న్న‌ట్లుగా ఉన్నారు ప్రేక్ష‌కులు. కానీ విడుద‌ల త‌ర్వాతి సినిమా చూసి ఔరా అనుకున్నారు. ఇక సంక్రాంతికి విడుద‌లైన *య‌న్.టి.ఆర్-క‌థానాయ‌కుడు* విష‌యంలో ప్రేక్ష‌కులు ఎక్కువ అంచ‌నాల‌తో ఉన్నారు. దీనికి ముందు నుంచి జ‌రిగిన ప్ర‌చారంతో ఏదో ఊహించుకున్నారు. కానీ ఆ చిత్రంలో పెద్ద‌గా డ్రామా లేక‌పోవ‌డం.. ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం చేటు చేసింది. సినిమాకు జ‌రిగిన అతి ప్ర‌చార‌మే దీనికి ప్ర‌తికూల‌మైంది.

ఇప్పుడు తెలుగులో మ‌రో బ‌యోపిక్ రాబోతోంది. అదే.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద తీసిన *యాత్ర‌*. ఈ సినిమాకు ముందు నుంచి పెద్ద‌గా బ‌జ్ లేదు. వైఎస్ ఏమీ సినిమా వాడు కాదు కాబ‌ట్టి.. గ్లామ‌ర్ ట‌చ్ మిస్స‌యింది. పైగా వైఎస్ జీవితంలోనూ పెద్ద డ్రామా క‌నిపించ‌దు. అందులోనూ ఇది ప్ర‌ధానంగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే చిత్రం. దీంతో బ‌జ్ త‌క్కువ‌గా ఉంది. ఐతే జ‌నాల్లో ఏ అంచ‌నాలు లేన‌పుడు.. సినిమా అంచ‌నాల కంటే ఎక్కువ‌గా ఉంటే పాజిటివ్ అవుతుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ ఒక క‌న్విక్షన్‌తో ఈ సినిమా తీశాడు. వైఎస్ సినిమాగా కాకుండా మామూలుగా చూసినా ఇది న‌చ్చే సినిమా అంటున్నాడు. మ‌మ్ముట్టి లాంటి గొప్ప న‌టుడు చేశాడంటే స్క్రిప్టులో.. సినిమా తీత‌లో ఏదో ప్ర‌త్యేక‌త లేకుండా పోదు. అస‌లు పోటీయే లేకుండా సోలోగా రిలీజ‌వుతుండ‌టం ఈ చిత్రానికి క‌లిసొచ్చే విష‌యం. ఓపెనింగ్స్ క‌ష్ట‌మే కానీ.. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే పుంజుకోవ‌డానికి మంచి అవ‌కాశ‌ముంటుంది. మ‌రి సినిమాకు ఎలాంటి టాక్ వ‌స్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English