బాహుబలిపైన ఒక లుక్కేద్దాం

బాహుబలిపైన ఒక లుక్కేద్దాం

ఈగ సినిమా తరువాత రాజమౌళి క్రేజ్‌ అమాంతం పెరిగిపోవడంతో, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఎవరైనాసరే ఆలోచిస్తూనే ఉంటారు. పైగా బాహుబలి అని చెబుతున్న రాజమౌళి, ఇంతవరకు ఆ సినిమాను కాస్త కూడా ముందుకు తీసుకువెళ్ళకపోవడమేని కాస్త కలవరపెట్టే అంశం. అందుకే ఇప్పుడు మనం అసలు జక్కన్న క్యాంప్‌లో ఏం జరుగుతుందో ఒక లుక్కేదాం.

కండలవీరుడు ప్రభాస్‌, మరో కండలవీరుడు రానా విలన్‌గా, అందాల అనుష్క యువరాణిగా నటిస్తున్న 'బాహుబలి' షూటింగ్‌ చెప్పాలంటే మే మొదటివారంలో మొదలవ్వాలి. కాని ఇప్పటివరకు సినిమా అంగుళం కూడా ముందుకు కదలకపోవడం విడ్డూరమే. అయితే బాహుబలి ప్రీ ప్రొడక్షన్‌ వర్కంతా మరో రెండు మూడు వారాల్లో అయిపోనుందని తాజా సమాచారం. ఆ తరువాత ప్రభాస్‌ కొత్త లుక్‌ ఎలా ఉంటుందో టెస్ట్‌ చెయ్యాలి, రానాకు, అనుష్కకు కూడా ఆ కాస్ట్యూమ్స్‌ను ఫిట్‌ చెయ్యాలి, ఆప్పుడు సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుంది. చూస్తుంటే జూలై మొదటివారం వరకు షూటింగ్‌ మొదలవ్వకపోవచ్చు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు