నీలకంఠని తీసేసింది తమన్నా కోసమే!

నీలకంఠని తీసేసింది తమన్నా కోసమే!

తమన్నా చిత్రం 'దటీజ్‌ మహాలక్ష్మి' చిత్రం ప్రోమోలు, పోస్టర్లు చూసినట్టయితే దర్శకుడి పేరు లేదనేది గమనించే వుంటారు. ముందుగా నీలకంఠ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని తర్వాత 'అ' దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పూర్తి చేసాడు. అయితే సగం సినిమా తీసిన నీలకంఠ కానీ, మిగతాది పూర్తి చేసిన ప్రశాంత్‌ వర్మ కానీ ఈ చిత్రానికి క్రెడిట్‌ తీసుకోవడం లేదు. అసలు సీనియర్‌ దర్శకుడు నీలకంఠ ఎందుకని ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు? చిత్రీకరణ సమయంలో తమన్నా, నీలకంఠ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయట.

సినిమా మొదలు పెట్టడానికి తనకు ప్రామిస్‌ చేసినవి కొన్ని జరగడం లేదని అభ్యంతరం లేవనెత్తానని, దాంతో అందరూ కలిసి దర్శకుడిని మార్చాలని నిర్ణయించుకున్నారని, నీలకంఠ కూడా దానిని గ్రేస్‌ఫుల్‌గా తీసుకుని తప్పుకున్నారని, ఆయనతో తనకి ఇంకా స్నేహ సంబంధాలు వున్నాయని, ఇప్పటికీ ఆయనతో మాట్లాడుతుంటానని తమన్నా చెప్పింది. ఇలాంటి ఇష్యూనే కంగన రనౌత్‌ నటించిన 'మణికర్ణిక' చిత్రానికి కూడా తలెత్తితే అక్కడ దానిపై ఎంత రచ్చ జరుగుతోందో చూసాం. కానీ ఇక్కడ ఇద్దరు దర్శకులు ఈ చిత్రం క్రెడిట్‌ కోసం ఆశ పడకపోవడంతో 'దటీజ్‌ మహాలక్ష్మి' దర్శకుడి పేరు లేకుండా రిలీజ్‌ అవుతోంది. విశేషం ఏమిటంటే... ఇది కూడా కంగన నటించిన క్వీన్‌ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌. కంగన ఇన్‌ఫ్లుయన్స్‌ తను చేసే సినిమాల మీదే కాకుండా తను చేసేసిన సినిమాలపై కూడా వుంటుందో ఏమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English