మేడమ్ కి ఆన్సర్ కావాలట

మేడమ్ కి ఆన్సర్ కావాలట

ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ గర్ల్ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు హీరోయిన్ గా మారిపోయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. గీత గోవిందంతో టాలీవుడ్ కి బాగా దగ్గరైన ఈ మేడమ్ అసలు సొంత ఇండస్ట్రీలో కనపడటం లేదనే విమర్శలు గట్టిగానే వచ్చాయి. టాలీవుడ్లో క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతుందని కెరీర్ ని మొదలెట్టిన కన్నడ గడ్డను అమ్మడు మరచిందనే విమర్శకు రష్మిక ఎక్కువగా అప్సెట్ అయినట్టుంది. అదే విదంగా కన్నడ పరిశ్రమ కూడా రష్మికపై గుర్రుగా ఉందని కథనాలు వచ్చాయి. అందుకే పైకి నవ్వుతూ విమర్శ కథనాలకు మేడమ్ గారు స్పందించారు.

ఈ విషయంలో రష్మీక తనకు ఆన్సర్ కావలనట్టుగా పేర్కొంది. ''ఇది ఎవరు చెప్పారు? తప్పుగా తీసుకోవద్దు. జస్ట్ ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలని ఉంది. నా ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉందా? ఇది రాసాక మీకు సెన్స్ లేదని అర్ధమయ్యింది. ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉంది అంటే నేను నమ్మను. నాకు ప్రూఫ్ కావాలి. ఇవ్వండి'' అంటూ గీత మేడమ్ సింపుల్ గా ట్వీట్లేసింది.

ఈ విధంగా రష్మిక ట్విట్టర్ లో వివరణ ఇచ్చేసరికి అది కాస్త వైరల్ గా మారింది. ఆన్సర్ కావాలని ఆమె అడిగిన తీరు బావుందని ఇప్పుడు రాసినవారు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూడాలని నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మేడం.. మీరు కన్నడ సినిమాలు ఎందుకు చేయట్లేదు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English