సినిమా చెయ్యాలంటేనే వణికిపోతున్న సూపర్‌స్టార్‌

సినిమా చెయ్యాలంటేనే వణికిపోతున్న సూపర్‌స్టార్‌

ఏ సినిమా చేసినా ఫ్లాపవుతూ వుండడంతో సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ అయోమయంలో పడిపోయాడు. ఇటీవల అన్నీ వైవిధ్యభరిత చిత్రాలే చేసినా షారుక్‌కి అదృష్టం కలిసి రాలేదు. మరుగుజ్జు పాత్ర చేసిన జీరోపై చాలా ఆశలు పెట్టుకుంటే అది చాలా పెద్ద డిజాస్టర్‌ అయింది. దీంతో అంతకుముందు ఓకే చేసుకున్న ప్రాజెక్టులు కూడా కాన్సిల్‌ చేసేసుకున్నాడు. ఇలాగయితే నటుడిగా కొత్తదనం చూపించాలంటేనే భయమేస్తోందని, రొటీన్‌ సినిమాలు చేసుకుని, వసూళ్లు తెచ్చుకుని, నా కారులో నేను హ్యాపీగా తిరిగేస్తూ బతికేయాలా అనిపిస్తోందని షారుక్‌ మీడియాతో అన్నాడు. షారుక్‌ స్థాయి వ్యక్తి ఇంత బేలగా మాట్లాడడం చూసి మీడియా వాళ్లకే చివుక్కుమంటోంది.

బాలీవుడ్‌ని బాద్షాలా ఏలిన షారుక్‌ చిత్రాలకి ఇప్పుడు బచ్చా హీరోలు కూడా భయపడని పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడూ లైన్లో నాలుగైదు ప్రాజెక్టులు వుండే హీరోకి ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎలాంటి సినిమా చేయాలనే దానిపై అవగాహన లేక, మరో సినిమా మొదలు పెట్టే ధైర్యం చేయలేక షారుక్‌ బాగా ఇబ్బంది పడుతున్నాడు. మరి కొన్నాళ్లలో కొడుకు, కూతురిని వెండితెరకి పరిచయం చేయాలనే ఆలోచనలో వుండగా షారుక్‌ ఇలా ప్రాభవాన్ని కోల్పోయి సగటు స్ట్రగులింగ్‌ యాక్టర్‌లా మారిపోవడం విచిత్రంగా లేదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English