మెగా హీరోలే అతని బ్రెడ్‌ అండ్‌ బటర్‌

మెగా హీరోలే అతని బ్రెడ్‌ అండ్‌ బటర్‌

డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఒక్కడే మెగా ఫ్యామిలీలోని ముఖ్యమయిన హీరోలందరితో (చరణ్‌ తప్ప) తలా ఒక సినిమా చేసేసాడు. ముందుగా పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌తో మొదలు పెట్టి తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' తీసాడు. అల్లు అర్జున్‌తో 'డిజె' తర్వాత చాలా మంది హీరోల చుట్టూ తిరిగి మళ్లీ ఒక మెగా హీరో దగ్గరే ఆగాడు. వరుణ్‌ తేజ్‌తో 'వాల్మీకి' తీస్తోన్న హరీష్‌ శంకర్‌ కావాలని ప్లాన్‌ చేసుకోకపోయినా మెగా హీరోలతో అలా సినిమాలు సెట్‌ అయిపోతున్నాయంతే. మెగా అభిమానులకి మరచిపోలేని 'గబ్బర్‌సింగ్‌'ని ఇచ్చిన హరీష్‌ని వారంతా చాలా ఇదిగా ఆదరిస్తుంటారు.

మధ్యలో ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా'తో పాటు 'గబ్బర్‌'కి ముందు రవితేజతో రెండు సినిమాలు చేసిన హరీష్‌ శంకర్‌ కనుక త్వరలో చరణ్‌ని కూడా మెప్పిస్తే ఇక మెగా డైరెక్టర్‌గా ట్యాగ్‌ తగిలించేయవచ్చు. అయితే గబ్బర్‌సింగ్‌ తర్వాత ఆ స్థాయిలో మరో ఎంటర్‌టైనర్‌ ఇవ్వలేకపోయిన హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం ఆ అపవాదు తొలగించుకునే పనిలో పడ్డాడు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'ని తనకి నచ్చినట్టుగా మార్చి తెలుగు ప్రేక్షకుల అభీష్టానికి తగ్గట్టు వడ్డిస్తున్నాడు. ఇది హిట్‌ అయితే ఇక హీరోల కోసం నెలల తరబడి పడిగాపులు పడే తప్పుతుందతనికి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English