ఈసారి వరుణ్‌ తేజ్‌దే డామినేషన్‌

ఈసారి వరుణ్‌ తేజ్‌దే డామినేషన్‌

'ఎఫ్‌ 2' చిత్రంలో తనవంతు చేయగలిగింది చేసినా కానీ వరుణ్‌ తేజ్‌కి రావాల్సినంత పేరు రాలేదు. కష్టపడి స్వఛ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడడంతో పాటు వెంకటేష్‌కి మంచి సపోర్ట్‌ ఇచ్చి ఈ చిత్ర విజయంలో భాగం పంచుకున్నాడు. కానీ వెంకటేష్‌ డామినేటింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ వల్ల వరుణ్‌ తేజ్‌ సైడ్‌కి వుండిపోయాడు. వెంకటేష్‌ కామెడీ బాగా పేలడంతో వరుణ్‌ తేజ్‌ కష్టం ఎక్కువమంది గుర్తించలేదు. ఆ సినిమాలో తనకి సపోర్టింగ్‌ రోల్‌ అయితే, త్వరలో మొదలు కాబోతోన్న హరీష్‌ శంకర్‌ సినిమా 'వాల్మీకి'లో వరుణ్‌ తేజ్‌దే డామినేషన్‌.

ఇది కూడా ఇద్దరు హీరోల సినిమానే కానీ నెగెటివ్‌ షేడ్స్‌ వుండే వరుణ్‌ క్యారెక్టర్‌కి వెయిట్‌ ఎక్కువ. మరో పాత్రని శ్రీవిష్ణు చేయనున్నాడు. తమిళంలో సిద్ధార్థ్‌ క్యారెక్టర్‌నే హీరోగా చూపించారు కానీ 'జిగర్తాండ' స్క్రిప్టుని మార్చేసిన హరీష్‌ శంకర్‌ విలన్‌ పాత్రని ఎలివేట్‌ చేస్తున్నాడు. 'వాల్మీకి' పాత్ర పోషిస్తోన్నది కూడా వరుణ్‌ తేజ్‌నే. ఈ చిత్రం చేయాలా, వద్దా అంటూ మీమాంసకి గురయిన వరుణ్‌ తేజ్‌ ఆ పాత్రని హరీష్‌ మలచిన తీరుకి ఫిదా అయిపోయాడట. అందుకే వేరే సినిమాని వెనక్కి నెట్టి మరీ ముందుగా వాల్మీకి కోసం గెటప్‌ ఛేంజ్‌ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English