క్రిష్‌ని బాలకృష్ణ మనిషిగా చూస్తున్నారా?

క్రిష్‌ని బాలకృష్ణ మనిషిగా చూస్తున్నారా?

'మణికర్ణిక' చిత్రాన్ని నేనే డైరెక్ట్‌ చేసా అంటూ క్రిష్‌ ఎంతగా పోరాటం చేస్తున్నా, తన పేరుని కొట్టేసి, సైడుకి నెట్టేసి కంగన రనౌత్‌ అన్యాయం చేసిందంటూ వాపోతున్నా టాలీవుడ్‌ అసలు ఏదీ వినబడనట్టే ప్రవర్తిస్తోంది. బాలీవుడ్‌నుంచి అయినా ఇంతవరకు కొందరయినా క్రిష్‌కి సపోర్ట్‌ ఇచ్చారు కానీ తెలుగు చిత్ర సీమ నుంచి మాత్రం క్రిష్‌ ట్విట్టర్లో అన్ని ట్వీట్లు పెడుతున్నా ఎవరూ సంఘీభావం తెలపడం లేదు. నిన్న మొన్నటి వరకు అందరికీ కావాల్సిన వాడయిన క్రిష్‌ ఒక్కసారిగా ఎందుకు అందరికీ దూరమయ్యాడు. అంత కష్టంలో అతను వుంటే కనీసం స్నేహితుల నుంచి కూడా ఎందుకని ఎలాంటి స్పందన లేదు? 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ డైరెక్ట్‌ చేయడం కోసం 'మణికర్ణిక' పూర్తి చేయకుండా వచ్చేయడం తప్పు అనేది చాలా మంది అభిప్రాయం.

గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్‌ బయోపిక్‌ తర్వాత క్రిష్‌కి బాలకృష్ణ మనిషిగా ముద్ర పడిపోయింది. ఎన్టీఆర్‌ చిత్రం విడుదలైనపుడు కూడా మహేష్‌ మినహా మిగతా వాళ్లెవరూ క్రిష్‌ని బహిరంగంగా అభినందించలేదు. పోనీ ఎన్టీఆర్‌ చిత్రానికి స్పందనలు రాజకీయాలు, వ్యక్తిగత సమీకరణాల వల్ల రాలేదని అనుకున్నా, సాటి తెలుగు వాడికి అన్యాయం జరిగితే ఇంత పెద్ద చిత్ర సీమ వుండి ఎవరూ అతడికి సపోర్ట్‌ ఇవ్వకపోవడం ఏమిటి? పోరాటాలేమీ చేయనక్కరలేదు... అతడిని నమ్ముతున్నాం అంటూ ఒక ట్వీట్‌ వేసినా అదే క్రిష్‌కి కొండంత బలాన్నిస్తుంది. మామూలుగా కాన్ఫిడెంట్‌గా వుండే క్రిష్‌లో ఈమధ్య ఆ ఛాయలు వెతికినా కనిపించడం లేదంటే మానసికంగా ఎంత నలిగిపోతున్నాడో అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English