నాగ చైతన్య కష్టాలు తీరినట్టే

నాగ చైతన్య కష్టాలు తీరినట్టే

వరుస వైఫల్యాలతో మార్కెట్‌ కోల్పోతోన్న నాగచైతన్యకి ఈ యేడాది అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. సమంతని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి నటిస్తోన్న తొలి చిత్రం మజిలీ పట్ల మంచి అంచనాలే వున్నాయి. పెళ్లయిన జంట కలిసి నటించిన చిత్రాలకి ప్రేక్షకాదరణ బాగుంటుందని గతంలో రుజువయింది. ఇక ఆ తర్వాత చేయబోయే చిత్రం వెంకటేష్‌తో కలిసి చేస్తున్నది. 'వెంకీ మామ' టైటిల్‌తో రూపొందే ఈ చిత్రం ఇంకా మొదలు కాక ముందే ట్రేడ్‌లో సూపర్‌ హాట్‌ అయిపోయింది. ఎఫ్‌2తో వెంకటేష్‌ అదరగొట్టడంతో 'వెంకీ మామ'పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత దిల్‌ రాజు బ్యానర్లో నాగచైతన్య ఒక చిత్రం చేయనున్నాడు.

జోష్‌తో దిల్‌ రాజు సంస్థలోనే పరిచయం అయిన నాగచైతన్య ఆ తర్వాత మళ్లీ ఆ బ్యానర్‌లో చేయలేదు. కొత్త దర్శకుడితో ఒక ప్రేమకథా చిత్రాన్ని నాగచైతన్యతో త్వరలోనే చేస్తున్నట్టు దిల్‌ రాజు ప్రకటించాడు. వరుస ఫ్లాపులతో ఫాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన చైతన్య ఇప్పుడు అన్నీ ప్రామిసింగ్‌ ప్రాజెక్టులు చేస్తూ త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English