తప్పదు.. వెంకీ మామ మరాల్సిందే

తప్పదు.. వెంకీ మామ మరాల్సిందే

వెంకటేష్ అంటే ఇప్పుడు మాములు హీరో కాదు. హార్దిక్ పాండ్య సిక్స్ కొడితే బంతి ఎంత ఫోర్స్ గా వెళుతుందో అలా బాక్స్ ఆఫీస్ గ్రౌండ్ లో కూడా వెంకీ ఒకే దెబ్బకు F2తో స్ట్రాంగ్ హిట్ అందుకున్నాడు. దీంతో నెక్స్ట్ షాట్స్ కూడా అదే తరహాలో ఉండాలని వెంకటేష్ అభిమానులు అంచనాలు పెంచేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోను మల్టీస్టారర్ సినిమా సింపుల్ గా హిట్ కావడంతో మనోడికి మినిమమ్ హిట్టు పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.  

వెంకటేష్ నెక్ట్స్ మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య తో వెంకీ మామ అనే మల్టీస్టారర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా F2 70 కోట్లకు పైగా లాభాలను అందించడంతో చిత్ర యూనిట్ కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ లో అంచనాలు విపరితంగా పెరిగిపోవడంతో దర్శకుడు స్క్రిప్ లో మార్పులు చేస్తున్నాడట. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ కి కూడా నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించాలని సురేష్‌ బాబు మరోసారి ఆర్డర్ ఇచ్చారట.

దీంతో సినిమా షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు టాక్. వెంకీ ఒకే చేసిన మరికొన్ని స్క్రిప్ట్ లలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి F2 వెంకటేష్ కెరీర్ కి హిట్టివ్వడమే కాకుండా తన తదుపరి సినిమాను కాస్త స్లో చేసిందన్నమాట. ఇప్పటికే చాలాసార్లు స్ర్కిప్టును మార్చిన దర్శకుడు బాబీ.. ఇప్పుడు ఎలాంటి చేంజెస్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English