హీరో రామ్ మగాడంటున్న నెటిజన్లు

హీరో రామ్ మగాడంటున్న నెటిజన్లు

సినిమాల్లో పెద్ద రేంజికి వెళ్లాక తమకున్న ప్రజాదరణను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటారు సినీ తారలు. కానీ అలా నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టేవారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ఇలా కాకుండా కేవలం ఎన్నికలు వచ్చినపుడు మాత్రం తమకు అనుబంధం ఉన్న పార్టీలకు ప్రచారం చేస్తుంటారు. ఇలా కాకుండా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు నిజాయితీగా సామాజిక మాధ్యమాల్లో పాజిటివ్‌గా మాట్లాడేవాళ్లు చాలా తక్కువమంది.

అందులోనూ ఇప్పుడు తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక సినీ తారలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లలో మెజారిటీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లే అయినప్పటికీ.. అక్కడి విషయాల్ని పట్టించుకోవడం, స్పందించడం బాగా తగ్గిపోయింది.

ఓవైపు అవకాశం వచ్చినపుడల్లా కేసీఆర్, కేటీఆర్‌ల మీద ప్రశంసలు కురిపిస్తూ.. తమ ప్రాంత నేతల గురించి, అక్కడి విషయాల గురించి అసలు స్పందించడం మానేశారన్న విమర్శలు టాలీవుడ్ సెలబ్రెటీలపై ఉన్నాయి. అందులోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ఒరవడి బాగా ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో యంగ్ హీరో రామ్.. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మీద ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయింది.

అనంతపురంలో కియా కార్ల పరిశ్రమలో తయారైన మొదటి కారును ఆవిష్కరించడంపై అతను పొగడ్తలు గుప్పించాడు. పార్టీ పేరునో.. చంద్రబాబు పేరునో ఎత్తకుండా ఇది పెద్ద మూమెంట్ అన్నట్లుగా మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు చాలా వరకు పాజిటివ్‌గా స్పందించారు. ఓవైపు టాలీవుడ్ హీరోలంతా కేటీఆర్ భజన చేస్తూ, తెరాస ప్రభుత్వానికి భయపడుతూ.. తమ సొంత ప్రాంతం గురించి స్పందించడం మానేశారని.. ఇలాంటి టైంలో రామ్ మగాడిలా మాట్లాడాడని.. జెన్యూన్‌గా స్పందించాడని అతడిని ప్రశంసించారు. బాబు భజన చేస్తున్నాడని కొందరు రామ్‌ను విమర్శించిన వాళ్లూ ఉన్నారు కానీ.. చాలా వరకు రామ్‌ను అభినందించిన వాళ్లే ఎక్కువమంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English