సీక్రెట్ చెప్పేసిన నిధి అగర్వాల్‌

సీక్రెట్ చెప్పేసిన నిధి అగర్వాల్‌

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. ఇప్పుడ ‘మిస్టర్ మజ్ను’తో పలకరించిన నిధి అగర్వాల్‌ను అందరూ ముంబయి భామే అనుకుంటున్నారు. ఆమె ఫీచర్స్ చూస్తే పక్కా బాలీవుడ్ భామ లాగా అనిపిస్తుంది. కానీ ఆమె పక్కా హైదరాబాదీ అట. ఆమె పుట్టింది భాగ్య నగరంలోనేనట. తనకు తెలుగు బాగా వచ్చట. తన తల్లి అయితే నూటికి నూరు శాతం తెలుగు మహిళ అని.. తమ కుటుంబానికి హైదరాబాద్‌లో 500 మంది బంధువులున్నారని నిధి అగర్వాల్ వెల్లడించడం విశేషం.

తమది చాలా పెద్ద కుటుంబం అని.. అందులో 80 శాతం మందికి తెలుగు తెలుసని నిధి వెల్లడించింది. తాను తెలుగు బాగా మాట్లాడగలనని.. తన ఫోన్లో కూడా తెలుగు పాటలే ఉంటాయని.. చాలా కాలం నుంచి తాను తెలుగు సినిమాలు చూస్తున్నానని చెప్పింది నిధి. హైదరాబాద్‌లో తనకు సొంత ఇల్లు ఉందని చెప్పిన నిధి.. ఇక్కడి వాతావరణమన్నా..భోజనమన్నా తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఇక్కడే పుట్టి పెరిగి బాలీవుడ్‌లో అవకాశాలు అందుకున్న తాను.. తిరిగి సొంత గడ్డకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

‘మిస్టర్ మజ్ను’ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఎంపిక కావడంపై నిధి చాలా ఎగ్జైట్ అయింది. తనకు ఊహ తెలిసిన తర్వాత తెలుగులో చూసిన సినిమా ‘పోకిరి’ అని.. ఆ సినిమా డైరక్ట్ చేసిన పూరితో కలిసి పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. తెలుగులో నిధి తొలి సినిమా ‘సవ్యసాచి’ డిజాస్టర్ కాగా.. ‘మిస్టర్ మజ్ను’ కూడా హిట్ కావడం సందేహంగానే ఉంది. ఐతే నిధి మాత్రం ఒక సినిమా రిలీజైన తర్వాత అది హిట్టా ఫ్లాపా అనే విషయాన్ని పట్టించుకోనని.. వెంటనే తర్వాతి సినిమాలోకి వెళ్లిపోతానని అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English