‘యాత్ర’ వల్ల రెండు మూడు ఓట్లు కూడా రావు

‘యాత్ర’ వల్ల రెండు మూడు ఓట్లు కూడా రావు

ఒక రాజకీయ నాయకుడి బయోపిక్ అనగానే దాని వెనుక ఆ నాయకుడి పార్టీకి చెందిన వాళ్ల ఆర్థిక మద్దతు కచ్చితంగా ఉంటుందనే ఆశిస్తారు అందరూ. పార్టీ నుంచో, దాని సానుభూతిపరుల ఫండింగ్ లేకుండా ఇలాంటి సినిమా తెరకెక్కడం దాదాపు అసాధ్యం అనే భావిస్తారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు ఉందనే అంతా అనుకుంటున్నారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదని అంటున్నాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.

వైఎస్ మీద సినిమా తీయమని తనకు ఎవ్వరూ చెప్పలేదని.. నిజానికి ఒకప్పుడు వైఎస్ గురించి తనకు పెద్దగా ఏమీ తెలియదని అతనన్నాడు. తాను అమెరికా ఇండియాకు వచ్చిన కొన్ని నెలల్లోనే వైఎస్ చనిపోయాడని చెప్పాడు.

ఆ తర్వాత తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నపుడు వైఎస్ గురించి అందరూ మంచిగా చెప్పడం విన్నానని.. ఈ రోజుల్లో ఒక నాయకుడి గురించి ఇలా మాట్లాడుకోవడం అరుదుగా అనిపించిందని.. అందుకే ఆయనపై సినిమా తీయాలని అనుకున్నానని.. తాను తీసిన ‘ఆనందో బ్రహ్మ’తో మంచి విజయాన్నందుకున్న నిర్మాతలకు ఈ ఆలోచన చెబితే చేద్దాం అన్నారని.. అలా సినిమా ముందుకు కదిలిందని.. మొత్తంగా తనకు తానుగా వైఎస్ మీద సినిమా తీయాలనిపించి తీశానని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ సినిమాతో ఎంతమాత్రం సంబంధం లేదని అతను స్పష్టం చేశాడు.

ఎన్నికలకు ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల వైకాపాకు కలిసొస్తుందా అని అడిగితే.. అలాంటిదేమీ ఉండదన్నాడు. ఒక సినిమా జనాల్ని ప్రభావితం చేస్తుందని తాను నమ్మనని.. ఎవరికి ఓటేస్తే ఎలాంటి లాభం ఉంటుందో జనాలు లెక్కలేసి చెబుతున్నారని.. సినిమా వల్ల అదనంగా రెండు మూడు ఓట్లు వస్తాయని కూడా తాను భావించట్లేదని.. ఒకవేళ వస్తే మంచిదే అని మహి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English