ఎన్టీఆర్‌, చరణ్‌ దెబ్బ మామూలుగా పడలేదు

ఎన్టీఆర్‌, చరణ్‌ దెబ్బ మామూలుగా పడలేదు

తెలుగు సినిమా బిజినెస్‌ ఒక్కసారిగా డంగైపోయింది. ఎఫ్‌ 2 ఘన విజయాన్ని అందుకున్నా కానీ ఎన్టీఆర్‌ కథానాయకుడు, వినయ విధేయ రామ పరాజయాలు మార్కెట్‌ని కుదిపేసాయి. ఈ రెండు చిత్రాలపై భారీగా నష్టపోయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు. పేరున్న బయ్యర్లంతా ఈ చిత్రాలతో అసోసియేట్‌ అయి వుండడంతో ప్రస్తుతం వారు కొత్త సినిమాల పంపిణీ మీద ఆసక్తి చూపించడం లేదు. దీంతో విడుదలకి సిద్ధమవుతోన్న చిన్న చిత్రాలని కొనేవాళ్లు కనిపించడం లేదు. దీంతో సడన్‌గా టాలీవుడ్‌ రైల్‌కి బ్రేక్‌ పడిపోయినట్టయింది.

వచ్చే రెండు వారాల్లో యాత్ర మినహా చెప్పుకోతగ్గ సినిమాలేవీ విడుదల కావడం లేదు. ఫిబ్రవరి, మార్చి మొత్తం ఇదే పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఏప్రిల్‌లో మహర్షి, జెర్సీలాంటి చిత్రాలు వస్తాయి. అందాకా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద స్తబ్ధత నెలకొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో వినయ విధేయ రామ, ఎన్టీఆర్‌, మిస్టర్‌ మజ్ను డిజాస్టర్స్‌ అవడంతో అక్కడ్నుంచి బయ్యర్లు కొత్త సినిమాలు కొనేందుకు ముందుకి రావడం లేదు. లోకల్‌గాను థర్డ్‌ పార్టీలు, ఎగ్జిబిటర్లు అంతా దారుణంగా నష్టపోయి వున్నారు. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు డిజాస్టర్‌ అయితే వుండే ఎఫెక్ట్‌ ఏమిటనేది ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English