ఆ లేడీ సింగర్‌తో జాగ్రత్తగా వుండాలి

ఆ లేడీ సింగర్‌తో జాగ్రత్తగా వుండాలి

ప్లేబ్యాక్‌ సింగర్‌గా కంటే, సమంతకి వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా ఎక్కువ పేరున్న చిన్మయి నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య. ఇంతకుముందు ఆమె ఎవరనేది ఎవరూ అంతగా లెక్క చేయలేదు కానీ ఇటీవల ఆమె ఓ రెబల్‌గా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా మీటూ ఇండియా ఉద్యమం ఊపందుకుంటోన్న టైమ్‌లో సోషల్‌ మీడియాలో చిన్మయి శివాలెత్తింది. జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు మీదే లైంగిక ఆరోపణలు చేసి సంచలనం చేసింది. పలువురు తమిళ సెలబ్రిటీలని సోషల్‌ మీడియాలో ఎండగట్టింది. ఆమెతో ఏదైనా మాట్లాడేటపుడు జాగ్రత్తగా వుండాలి.

కీ బోర్డే కదా అని ఏది పడితే అది టైప్‌ చేసి ఆమెని ఇరిటేట్‌ చేస్తే అందరికీ తెలిసేటట్టుగా ఎండగట్టేస్తుంది. చీరల్లో మాత్రమే కనిపించండి అంటూ ఒక అభిమాని రిక్వెస్ట్‌ చేస్తే, చీరలో కనిపిస్తే నడుముని, సైడ్‌ నుంచి చెస్ట్‌ని చూసి 'హస్త ప్రయోగం' చేసుకునే వాళ్లున్నారని, ఎక్స్‌పోజ్‌ అయిన పార్ట్స్‌ని సర్కిల్‌ చేసి పోర్న్‌ సైట్స్‌లో పెడుతున్నారని, ధరించే ఏ దుస్తుల్లో అయినా మగాళ్లు స్త్రీని గౌరవప్రదంగా చూడరని చిన్మయి షాకింగ్‌ రిప్లయ్‌ ఇచ్చింది. దీంతో ఆమెతో ఏమి మాట్లాడాలన్నా కాస్త జాగ్రత్తగా వుండాలని, వీలయితే ఆమెతో ఇంటరాక్ట్‌ అవకపోవడమే ఉత్తమమని సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English