ఇది బాలకృష్ణ స్వయంకృతం

ఇది బాలకృష్ణ స్వయంకృతం

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఘోర పరాజయాన్ని ఇప్పటికే పలువురు పోస్ట్‌మార్టమ్‌ చేసారు. సావిత్రి జీవిత కథ చూడ్డానికి ఎగబడ్డ జనం 'ఎన్టీఆర్‌' జీవితం గురించి తెలుసుకునే ఉత్సాహం ఎందుకు చూపించలేదనేది మంచి కేస్‌ స్టడీగా మారింది. కర్ణుడి చావుకి వేల కారణాలన్నట్టు, ఈ చిత్రం ఫ్లాప్‌ అవడానికి కూడా చాలా కారణాలున్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఫలానా డేట్‌కి రిలీజ్‌ చేయాలనే డెడ్‌లైన్‌ పెట్టుకుని, షూటింగ్‌ కూడా మొదలు పెట్టకుండానే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిపోవడం. సంక్రాంతి సెంటిమెంట్‌తో తన సినిమాలని సంక్రాంతికి విడుదల చేసి తీరాలని బాలకృష్ణ భావిస్తుంటారు. ఎన్టీఆర్‌కి దర్శకుడు మారిన తర్వాత కూడా డేట్‌ మాత్రం మారలేదు. దాంతో క్రిష్‌కి గ్రౌండ్‌ వర్క్‌ చేయడానికి తగినంత సమయం దొరకలేదు. హడావిడిగా స్క్రిప్టు రెడీ చేసి అంతే హడావుడిగా షూటింగ్‌ కానిచ్చేసారు. అయితే విడుదల తేదీ సమీపించే కొద్దీ షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమని తేలింది.

దీంతో రెండు భాగాల కాన్సెప్టు తెరమీదకి వచ్చింది. అంతిమంగా అది ఈ చిత్రానికి అతి పెద్ద బ్లండర్‌ అయింది. గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో కూడా బాలకృష్ణ ఇలా డేట్‌ విషయంలో పట్టింపుకి వెళ్లడం వల్ల సరయిన కంటెంట్‌ లేకుండానే సెట్స్‌ మీదకి వెళ్లిపోయారు. సినిమా స్కేల్‌ ఏమిటి, దాని చిత్రీకరణకి ఎన్ని రోజులు అవసరమవుతుంది లాంటివి చూడకుండా ఇంకా పండగ సెంటిమెంట్‌ అంటూ వెళితే ఇలాగే అవుతుంది. అయినా బాలయ్యకి సంక్రాంతికి బ్లాక్‌బస్టర్లతో పాటు మైండ్‌ బ్లాక్‌ చేసే డిజాస్టర్లు కూడా చాలానే వున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ కూడా రెండవ లిస్టులో చేరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English