క్లాసిక్ జోలికి ఎందుకు చైతూ?

క్లాసిక్ జోలికి ఎందుకు చైతూ?

అక్కినేని యువ హీరోల పరిస్థితి మళ్ళీ డైలమాలో పడింది. అఖిల్ సంగతి పక్కనపెడితే ఒక స్టేజ్ లో తనకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నాగ చైతన్య ఈ మధ్య ప్రయోగాల పనిలో పడ్డాడు. సవ్యసాచితో బాక్స్ ఆఫీస్ ముందు అంచనాలను రేపి ఉహించని విధంగా డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కథల గురించి జాగ్రత్త వహించకుండా మళ్ళీ అదే దూకుడుతో వెళుతున్నాడు.

తాత నాగేశ్వరరావు చేసిన క్లాసిక్ సినిమా దేవ్ దాస్ ని టచ్ చేయడానికి నాగ చైతన్య ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రచించిన దేవదాస్ బేస్డ్ కథకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అన్నపూర్ణ బేనర్ పై ఈ కొత్త ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే కథ మాత్రం క్లాసిక్ సినిమాలను టచ్ చేసే విధంగా ఉండడంతో అభిమానుల్లో ఇప్పుడు కొత్త అలజడి రేగుతోంది.

నాగచైతన్యకు ఇప్పుడు క్లాసిక్ రిస్క్ అవసరమా అనే కామెంట్స్ వస్తున్నాయి. నాగ్ ఏ విధంగా ఒప్పుకున్నాడో తెలియదు గాని దేవదాస్ వంటి సినిమాను చేయడానికి కావల్సిన పరిణితి ఇంకా చైతన్యలో లేదనే చెప్పాలి. అటు నటన, ఇటు పాత్రను భుజాలపై నడిపించే తీరు.. రెండింటిలోనూ చైతూ చాలా ఇంప్రూవ్ కావల్సి ఉంది. ఈ టైములో దేవదాస్ తో గేమ్స్ అంటే రిస్కు కాదు రిస్కున్నర అనాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English