తాతగారికి కాజల్‌పై మనసైంది

తాతగారికి కాజల్‌పై మనసైంది

అరవయ్యేళ్లకి దగ్గర పడుతున్న కమల్‌ హాసన్‌ ఇంకా తన కూతురి వయసు హీరోయిన్ల సరసన నటించడానికి సరదా పడుతున్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర రంగాన్ని ఊపేస్తోన్న కాజల్‌ అగర్వాల్‌తో నటించాలని కమల్‌ కోరుకుంటున్నారట. యువ హీరోలతో మాత్రమే నటిస్తున్న కాజల్‌ తెలుగులో కూడా సీనియర్లు వెంకటేష్‌, నాగార్జునతో నటించలేదు. వారి కంటే వయసులో చాలా పెద్ద అయిన కమల్‌తో నటించడానికి కాజల్‌ రెడీ అంటుందా?

తమిళ రంగంలో కమల్‌, రజనీతో నటించడం అంటే ఏ హీరోయిన్‌కి అయినా పెద్ద అఛీవ్‌మెంట్‌. దానిని సాధించడం కోసం అయినా కాజల్‌ ఈ ఆఫర్‌ని ఓకే చేస్తుందేమో చూడాలి. కమల్‌తో లింగుస్వామి ఒక కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ని తీసుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. తమిళంలో టాప్‌ హీరోయిన్‌ అయ్యే దిశగా దూసుకు పోతున్న కాజల్‌ ఈ చిత్రం ఓకే చేసినట్టయితే ఆ గోల్‌కి మరింత దగ్గరవుతుంది. కమల్‌ ముసలాడు అయిపోయినా కానీ ఆయన క్రేజ్‌ మాత్రం ఇంచ్‌ కూడా తగ్గలేదు. విశ్వరూపం చిత్రానికి దక్కిన ఆదరణే అందుకు సాక్ష్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు