మొండి ఘటాన్ని ఒప్పించేశాడబ్బా

మొండి ఘటాన్ని ఒప్పించేశాడబ్బా

టాలీవుడ్లో కొందరు నిర్మాతలకు మొండి ఘటాలుగా పేరుంది. వాళ్లను ఒక కథతో ఒప్పించి.. సినిమా ఓకే చేసుకోవడం రచయితలు, దర్శకులకు సవాలే. అలాంటి నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఒకప్పుడు వరుసగా భారీ సినిమాలు చేస్తూ వచ్చిన సురేష్ బాబు.. గత దశాబ్దంలో బాగా జోరు తగ్గించేశారు.

సొంతంగా సినిమాలు నిర్మించడం బాగా తగ్గించేసిన సురేష్.. వేరే వాళ్లు చేసిన చిన్న సినిమాల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం, లాభాల్లో వాటా తీసుకోవడం చేస్తున్నారు. ఐతే సురేష్ చాలా కాలం తర్వాత తన బేనర్లో ఓ పెద్ద బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. తన తమ్ముడు వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్యల కాంబినేషన్లో ‘వెంకీ మామ’ అనే సినిమాను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘పవర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జై లవకుశ’ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఐతే ప్రారంభోత్సవం జరిగి చాలా కాలం అయినా ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ముందు లైన్ చెప్పి సినిమా ఓకే చేయించుకుని ఓపెనింగ్ కానిచ్చిన బాబీ.. పూర్తి స్క్రిప్టు విషయంలో సురేష్ బాబును మెప్పించలేకపోయినట్లు సమాచారం.

స్క్రిప్టు మీద కొన్ని నెలల పాటు పని చేసి.. చాలా వెర్షన్లు వినిపించి.. కరెక్షన్ల మీద కరెక్షన్లు చేస్తూ ఉన్నా సురేష్ బాబు ఒక పట్టాన స్క్రిప్టు ఓకే చేయలేదని సమాచారం. ఒక దశలో బాబీ విసిగిపోయి ఈ సినిమాను వదిలేద్దామా అన్నంత ఫ్రస్టేట్ అయ్యాడట. ఐతే తన గురువు కోన వెంకట్ సహకారంతో మొత్తానికి సురేష్ సంతృప్తి చెందేలా స్క్రిప్టు తీర్చిదిద్దాడని.. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిందని సమాచారం. ఫిబ్రవరి 21న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ముహూర్తం కూడా చూశారట. ‘ఎఫ్-2’ పూర్తి చేసి చాలా రోజుల కిందట వెంకీ ఫ్రీ అయిపోగా.. ఇంకో మూడు వారాల్లో ‘మజిలీ’ని ఒక కొలిక్కి తెచ్చేసి చైతూ ఈ చిత్ర షూటింగులో పాల్గొనబోతున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English